అన్వేషించండి

DD Next Level OTT Release Date: డీడీ నెక్స్ట్ లెవెల్ ఓటీటీ రిలీజ్ డేట్: సంతానం కొత్త సినిమా... రివ్యూ రైటర్లను టార్గెట్ చేసిన దెయ్యం కథ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

DD Next Level OTT Streaming Telugu: సంతానం హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ 'డీడీ నెక్స్ట్ లెవెల్'. గౌతమ్ మీనన్, గీతికా తివారి, యాషిక ఆనంద్ నటించిన ఈ సినిమా త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ తమిళ హాస్య నటుడు సంతానం (Santhanam) హీరోగా రూపొందిన తాజా సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' (DD Next Level). 'దిల్లుకు దుడ్డు' ఫ్రాంచైజీలో నాలుగో చిత్రమిది. మే 16న థియేటర్లలో విడుదల అయింది. అతి త్వరలో ఈ సినిమా 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో...
రివ్యూ రైటర్లను టార్గెట్ చేసి చంపే దెయ్యం!
సంతానం కథానాయకుడిగా నటించిన 'డీడీ నెక్స్ట్ లెవెల్' సినిమాలో ఆయనకు జంటగా గీతికా తివారి నటించారు.‌ ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాషికా ఆనంద్ మరొక జంటగా కనిపించారు. ఇందులో సంతానం సిస్టర్ రోల్ చేశారు యాషిక. 

'డీడీ నెక్స్ట్ లెవెల్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ 'జీ 5' సొంతం చేస్తుంది. థియేటర్లలో మే 16న విడుదలైన ఈ సినిమాను జూన్ 13 డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు 'జీ 5' పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వీక్షకులకు అందుబాటులో ఉంటుందని 'జీ 5' తెలిపింది.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Tamil (@zee5tamil)

'డీడీ నెక్స్ట్ లెవెల్' కథ విషయానికి వస్తే... కిస్సా (సంతానం) ఒక రివ్యూ రైటర్. హిచ్‌ కాక్ ఇరుద‌య‌రాజ్(సెల్వ‌రాఘ‌వ‌న్‌) దర్శకుడు. రివ్యూ రైటర్లను అతడు టార్గెట్ చేస్తాడు. సినిమా ప్రీమియర్ షో వేస్తున్నామని, చూడ‌టానికి వ్య‌క్తిగ‌తంగా ర‌మ్మ‌ని రివ్యూ రైటర్లు ఒక్కొక్కరికీ అతను ఆహ్వానాలు పంపిస్తాడు. కిస్సా కూడా ప్రీమియర్ అనుకుని వస్తాడు. హాలులో అడుగు పెట్టిన తర్వాత కిస్సా ప్ర‌పంచం ఒక్క‌సారిగా త‌ల‌కిందులు అవుతుంది. 

కిస్సాను దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లోకి పంపిస్తాడు హిచ్ కాక్ ఇరుదయరాజ్. అక్కడ నుంచి మరో దీవికి వెళాల్సి వస్తుంది. క్రూయిజ్ & దీవిలో అతని తల్లిదండ్రులు వేర్వేరు వ్యక్తులుగా కనిపిస్తారు. కిస్సా గాళ్ ఫ్రెండ్ ఆత్మగా మారుతుంది. ఎందుకలా జరిగింది? కిస్సాతో పాటు అక్కడ ఇరుక్కున్న మరో ఇద్దరు రివ్యూ రైటర్లు దాన్నుంచి బయట పడటం కోసం డైరీలో విష‌యాల‌ను డీకోడ్ చేయ‌టానికి సిద్ధమైన తర్వాత ఏం జరిగింది? అక్కడ అతింద్రీయ శ‌క్తుల బ‌ల‌హీన‌త‌లు ఎలా గుర్తించారు? చివరకు ఎలా బయట పడ్డారు? ఈ ప్రయాణంలో ఎన్ని ఫీట్స్ చేశారు? అనేది సినిమా.

Also Read: నాగార్జున సినిమాలో సీన్ మక్కీకి మక్కీ దించేసిన మురుగదాస్... 'గజినీ'లో లవ్ ట్రాక్‌ ఒరిజినల్ కాదు, కాపీ... ఇదిగో ప్రూఫ్


ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'డీడీ నెక్స్ట్ లెవెల్' సినిమాను ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల సహకారంతో వెంకట్ బోయినపల్లి, ఆర్య నిర్మించారు. ఇందులో తిరుపతి ప్రస్తావనతో రాసిన ఒక పాట వివాదాస్పదం కాగా... గౌతమ్ మీనన్, యాషిక మీద 'ఘర్షణ'లో చెలియా చెలియా సాంగ్ రీ క్రియేట్ చేయడం ఆడియన్స్ దృష్టిని ఎట్రాక్ట్ చేశాయి.

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget