అన్వేషించండి

Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Dacoit OTT Platform : యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రీసెంట్ మూవీ డెకాయిట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది.

Adivi Sesh's Dacoit OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్. షానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అడివి శేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చిన మూవీగా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'డెకాయిట్' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మూవీలో అడివి శేష్, మృణాల్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

Also Read : మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!

స్టోరీ ఏంటంటే?

హరిదాస్ (అడివి శేష్) ఓ మర్డర్ కేసులో 13 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు కడప జైలు నుంచి మారుస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. దీని కోసం అతనికి ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) సాయం చేస్తాడు. హరిదాస్ తప్పించుకోగానే అతన్ని దుబాయ్ పంపించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తాడు. అయితే, హరి దుబాయ్ వెళ్లేందుకు ఇంకా రూ.60 లక్షలు అవసరం అవుతాయి. దుబాయ్ వెళ్లే లోపు తనకు అవసరమైన డబ్బు సంపాదించడంతో పాటు మరో పని కూడా చేయాలని హరి భావిస్తాడు.

తాను జైలుకు వెళ్లేందుకు కారణమైన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హరి. ఆమెను వెతుకుతుండగా భర్త భాస్కర్ (వైభవ్), ఆరేళ్ల కూతురితో దర్శనమిస్తుంది. ఆమె భర్తకు వైద్య ఖర్చుల కోసం రూ.కోటి అవసరం అవుతుంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న హరి అవసరాన్ని అడ్డు పెట్టుకుని దెబ్బ కొట్టాలని ఓ ప్లాన్ వేస్తాడు. అసలు హరి, జూలియట్ ఎందుకు  విడిపోయారు? హరి జైలుకు వెళ్లేందుకు జూలియట్ ఎందుకు కారణమైంది? హరి మళ్లీ తన జీవితంలోకి వచ్చాక సరస్వతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆమె భర్త భాస్కర్‌కు కేసుకు లింక్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : సాయి పల్లవి ఏక్ దిన్‌ కలెక్షన్స్ - బాలీవుడ్ ఎంట్రీ మూవీ షాక్ ఇచ్చిందా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Athiradi OTT : అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget