అన్వేషించండి

This Week Theatrical Releases : మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!

This Week Telugu Theatrical Releases : మే ఫస్ట్ వీక్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచీ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్స్ వరకూ మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

This Week Theatrical Releases Telugu Complete List : మే ఫస్ట్ వీక్‌లో దాదాపు 5 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్టైన్మెంట్ అందించేదుకు కొత్త మూవీస్ రాబోతున్నాయి. ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. స్పిరిట్ మూవీ కూడా ఈ వారం రిలీజ్ కానుంది. అయితే, ఇది ప్రభాస్, సందీప్ వంగా కాంబో 'స్పిరిట్' కాదు. రైతుల నేపథ్యంలో సాగే స్టోరీతో రానున్న చిత్రం. 

మెగా కోడలి 'సతీ లీలావతి'

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహించగా... ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సీనియర్ హీరో నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్, మొట్ట రాజేంద్రన్, జాఫర్, జోషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించగా... మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Durga Devi Pictures LLP (@durgadevipictures)

వయలెన్స్ పీక్... 'రేజర్'

నటుడు, దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హై వయలెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్'. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఓ చిన్నారిని కాపాడేందుకు రవిబాబు సృష్టించిన వయలెన్స్ అంతా ఇంతా కాదు. టీజర్, ట్రైలర్‌లో రక్తపాతం పాళ్లు మామూలుగా లేదు. రవిబాబుతో పాటు తనీష్, నటుడు బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 8న వరల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Babu (@ravibabuofficial)

గోదారి గట్టుపైన...

'మేమ్ ఫేమస్' ఫేం, యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన'. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్ ఇతర తారాగణం. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Red Puppet Productions (@redpuppetproductions)

Also Read : యశ్‌తో బోల్డ్ సీన్స్ - ట్రిమ్ చేయాలని కియారా రిక్వెస్ట్... వైరల్ వార్తల్లో నిజమెంత?

Also Read : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి

రిషబ్ శెట్టి 'ఏ ఫిల్మ్ బై గిరి'

కాంతార ఫేం రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఏ ఫిల్మ్ బై గిరి'. కరణ్ అనంత్, అనిరుధ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో... రిషబ్ సరసన రచనా ఇందర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్ పి తపస్విని, ప్రమోద్ శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 8న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైతుల నేపథ్యంలో 'స్పిరిట్'

రైతు దంపతులు నర్సమ్మ, వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన లేటెస్ట్ సోషల్ డ్రామా 'స్పిరిట్'. గొర్రెలు కాచుకుంటూ జీవనం సాగించే సాధారణ రైతుల దంపతులు సినిమాపై ఇష్టంతో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవిబాబు, సత్య ప్రకాష్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 8th వండర్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
Modern Missamma Lyrics - మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget