గూఢచారి to డెకాయిట్... అడివి శేష్ ఫిలిమ్స్ బిజినెస్‌ తెలుసా?

Published by: Satya Pulagam

ప్రపంచవ్యాప్తంగా ' డెకాయిట్' సినిమా 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

'డెకాయిట్'కు ముందు అడివి శేష్ సినిమాల బిజినెస్ వేల్యూ 15 కోట్లు దాటలేదు. ఈ సినిమాతో ఆయన మార్కెట్ డబుల్ అయ్యింది.

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్ నటించిన క్రైమ్ థిల్లర్ 'హిట్ 2'. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 14.25 కోట్లు. 

'మేజర్'తో అడివి శేష్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమాకు 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

అడివి శేష్ 'ఎవరు' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 10 కోట్లు.

అడివి శేష్ కు పేరు తెచ్చిన సినిమా 'గూఢచారి'. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ 5 కోట్లు మాత్రమే.

'గూఢచారి' నుంచి 'డెకాయిట్' వరకు... అడివి శేష్ లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 72.50 కోట్లు. 

'డెకాయిట్' తర్వాత 'గూఢచారి' సీక్వెల్ 'జీ 2'తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు అడివి శేష్ రానున్నారు.

ప్రతి సినిమాతో విజయం సాధిస్తూ తన మార్కెట్ పెంచుకుంటున్నారు అడివి శేష్.