'డెకాయిట్' ప్రీ రిలీజ్ బిజినెస్... అడివి శేష్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

Published by: Satya Pulagam

'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్', 'హిట్ 2' సినిమాలతో అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో ఆయనకు ఒక మార్కెట్ ఏర్పడింది. మరి, 'డెకాయిట్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

నైజాంలో 'డెకాయిట్' థియేట్రికల్ రైట్స్ రూ. 7 కోట్లకు అమ్మారని తెలిసింది.

రాయలసీమ (సీడెడ్)లో 'డెకాయిట్' థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 2.5 కోట్లకు ఇచ్చారట.

ఆంధ్రాలో ఏరియాలను రూ. 9.50 రేషియోలో విక్రయించారట. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'డెకాయిట్' రూ. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, డబ్బింగ్ రైట్స్ ద్వారా 'డెకాయిట్' నిర్మాతలకు రూ. 5 కోట్లు వచ్చినట్టు తెలిసింది.

అమెరికాలో అడివి శేష్ కి మంచి మార్కెట్ ఉంది. అందువల్ల, 'డెకాయిట్' ఓవర్సీస్ రైట్స్ 6 కోట్ల రూపాయలకు అమ్మారు.

'డెకాయిట్' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 30 కోట్లు.

ప్రజెంట్ అడివి శేష్ ముందున్న టార్గెట్ రూ. 31 కోట్ల షేర్. అంత రావాలంటే ఎలా లేదన్నా 60 కోట్ల గ్రాస్ రావాల్సిన అవసరం ఉంది.