Badmashulu OTT Release Date: ఊరంతా తిట్టే 'బద్మాషులు' ఓటీటీలోకి వచ్చేస్తున్నారు - ఎప్పుడు, ఎందులో వస్తుందో తెలుసా?
Badmashulu OTT Platform: తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బద్మాషులు' ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

Mahesh Chintala's Badmashulu OTT Release On ETVWin: తెలంగాణ ప్రాంతంలో పల్లె బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్‌టైనర్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి రీసెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ డ్రామా 'బద్మాషులు'. జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 8 నుంచి మూవీ అందుబాటులో ఉంటుందని ఓటీటీ సంస్థ తెలిపింది. శంకర్ చేగూరి దర్శకత్వం వహించగా... బలగం మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత, దీక్ష కోటేశ్వరన్, అన్షుమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తేజ కూనూరు మ్యూజిక్ అందించగా... బి.బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు.
🤣 Fun, friendship & full-on comedy!#Badmashulu streaming from Aug 8th on @etvwin pic.twitter.com/JTjsPiYmfz
— ETV Win (@etvwin) August 5, 2025
Also Read: సెన్సార్ వివాదాల లేటెస్ట్ థ్రిల్లర్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
స్టోరీ ఏంటంటే?
తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు ట్రైలర్ తిరుపతి (మహేష్ చింతల), బార్బర్ ముత్యాలు (విద్యాసాగర్ కారంపురి) సరదాగా తిరుగుతుంటారు. ఎప్పటికప్పుడు పని ఎగ్గొట్టి భార్యా పిల్లలను పట్టించుకోకుండా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఊరంతా వీరిని 'బద్మాషులు' అంటుంటారు. ఓసారి తాగేందుకు డబ్బుల్లేక ఊరి స్కూళ్లో చిన్న చోరీ చేస్తారు. పోలీసులకు దొరికిపోగా 4 రోజులు స్టేషన్‌లోనే ఉంచి పంపించేస్తారు.
ఇదే టైంలో అదే స్కూల్లో కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. అయితే, వైర్ దొంగిలించిన వీరిద్దరే కంప్యూటర్ కూడా చోరీ చేశారనే నింద పడుతుంది. దీంతో పోలీసులు వీరి వెంట పడతారు. అసలు ఆ కంప్యూటర్ దొంగతనం చేసింది ఎవరు? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్ (మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు ఎలాంటి సహాయం చేశారు? చివరకు వీరిద్దరూ మారారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















