Janaki V Vs State Of Kerala OTT Release Date: సెన్సార్ వివాదాల లేటెస్ట్ థ్రిల్లర్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Janaki V Vs State Of Kerala OTT Platform: సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Anupama Parameswaran's Janaki V Vs State Of Kerala OTT Release On Zee5: రిలీజ్‌కు సెన్సార్ వివాదాలతో హాట్ టాపిక్‌గా మారిన లేటెస్ట్ లీగల్ థ్రిల్లర్ మూవీ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి, శ్రుతి రామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కోర్డు రూమ్ డ్రామా ప్రముఖ ఓటీటీ 'Zee5'లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. లైంగిక వేధింపులకు గురైన ఓ అమ్మాయి చేసిన న్యాయ పోరాటం బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీని ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించారు. సురేష్ గోపి ఇందులో లాయర్‌గా కనిపించారు.
View this post on Instagram
Also Read: చంద్రబాబుకు జయప్రద ప్రేమలేఖ నిజమా? 'మయసభ' కోసం రాజకీయ వర్గాలూ వెయిటింగ్... ఇందుకేనా?
అసలేంటి వివాదం?
ఈ మూవీలో లైంగిక వేధింపులు, అత్యాచారానికి గురైన అమ్మాయి పాత్రలో అనుపమ నటించారు. కథ మొత్తం ఆమె చేసిన న్యాయపోరాటం చుట్టూనే తిరుగుతుంది. మూవీలో ఆమె పేరు జానకి కాగా... హిందువులు ఎంతో పరమ పవిత్రంగా పూజించే జానకి పేరును ఆ రోల్‌కు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరు జానకి అని... టైటిల్ మార్చాలంటూ సూచించింది. దీంతో పాటు మూవీలో 96 కట్స్ చేయాలని తెలిపింది.
అయితే, సెన్సార్ బోర్డు తీరుపై మూవీ టీం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టైటిల్ మారిస్తే మొత్తం డైలాగ్స్ కూడా మార్చాల్సి వస్తుందంటూ డైరెక్టర్ ప్రవీణ్ సెన్సార్ బోర్డుకు తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. మలయాళ ఇండస్ట్రీ కూడా సెన్సార్ బోర్డు తీరుపై అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు యూటర్న్ తీసుకుంటూ రెండే రెండు మార్పులు సూచించింది. 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' బదులు 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కానీ 'వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కానీ టైటిల్ పెట్టాలని తెలిపింది. మూవీలో కోర్డు క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో జానకి పేరును మ్యూట్ చేయాలని సూచించింది. ఈ మార్పులతోనే మూవీని రిలీజ్ చేశారు టీం.
స్టోరీ ఏంటంటే?
బెంగుళూరుకు చెందిన ఐటీ ఉద్యోగిని కేరళలోని తన ఊరికి వెళ్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతుంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి న్యాయపోరాటం చేశారు? చివరకు నిందితుడు దొరికాడా? అనేదే స్టోరీ.





















