అన్వేషించండి

Mayasabha: చంద్రబాబును ప్రేమించిన హీరోయిన్‌... ఆ అమ్మాయి ఎవరు? 'మయసభ'పై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి

Chandrababu Naidu role in Mayasabha: ఫిక్షనల్ వెబ్ సిరీస్ అని దర్శకుడు దేవాకట్టా చెబుతున్నప్పటికీ... చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిపై 'మయసభ' తీశారని తెలుస్తోంది. సీబీఎన్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది.

ప్రేక్షకులలో కంటే రాజకీయ వర్గాల్లో 'మయసభ' వెబ్ సిరీస్ మీద ఎక్కువ ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు దిగ్గజ నాయకులైన ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఎలా చూపించబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. తనది ఫిక్షనల్ వెబ్ సిరీస్ అని 'మయసభ' క్రియేటర్ - దర్శకులలో ఒకరైన దేవాకట్టా చెబుతున్నారు. కానీ సీబీఎన్ - వైయస్సార్ మీద సిరీస్ తీశారని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు కాలేజీ డేస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

కాలేజీలో చంద్రబాబుకు ప్రేమకథ!?
'మయసభ'లో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) నటించారు. అది నారా చంద్రబాబు నాయుడును పోలిన పాత్ర. ఆ మాట అంటే దేవాకట్టా ఒప్పుకోరు. కానీ, అది నిజమని ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులకూ తెలుసు.

'మయసభ'లో కాలేజీ రోజుల నుంచి కాకర్ల కృష్ణమ నాయుడు (నారా చంద్రబాబు నాయుడు?) ప్రయాణాన్ని చూపించారట. పీహెచ్‌డీ చేయడానికి ఓ కాలేజీలో చేరిన కృష్ణమ నాయుడు, అక్కడ ఓ అమ్మాయి అను హారికను చూసి మనసు పడతారట. ఓ దశలో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే వాళ్ళిద్దరి పెళ్లి ఎందుకు కాలేదు? ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అగ్ర కథానాయకుడు అయినటువంటి రాయపాటి చక్రధర్ రావు (ఆర్‌సీఆర్‌) కుమార్తెతో వివాహ సంబంధం కుదరడం వెనుక ఎవరు ఉన్నారు? వంటివి 'మయసభ'లో ఉన్నాయని టాక్. కృష్ణమ నాయుడుకు అను హారిక ప్రేమ లేఖ కూడా రాసినట్టు భోగట్టా. కాలేజీ మధ్యలో వదిలేసిన ఆ అమ్మాయి.... తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? అనే ఆసక్తి మొదలైంది. ఆ కారణం చేత ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న సిరీస్‌ మీద రాజకీయ వర్గాల్లోనూ ఎక్కువ ఆసక్తి నెలకొంది. హీరోయిన్ అను హారిక పాత్రలో తాన్యా రవిచంద్రన్ నటించారు.

చంద్రబాబు కాదు... ఆయనకు నత్తి ఉందా?
కాకర్ల కృష్ణమ నాయుడు క్యారెక్టర్ చంద్రబాబును ఉద్దేశించినది కాదని దేవాకట్టా బల్లగుద్ది మరీ, నొక్కి వక్కాణించి మరీ చెబుతున్నారు. కాకర్ల కృష్ణమ నాయుడుకు నత్తి ఉన్నట్టు చూపించారు. చంద్రబాబుకు నత్తి ఉందా? ఆ క్యారెక్టర్ అలా చూపించారు ఏంటి? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే... ''చంద్రబాబు కాదు కదా! ఆయనకు నత్తి లేదు కాబట్టి కృష్ణమ నాయుడు వేరు'' అని వాదిస్తున్నారు దేవాకట్టా. మరి సిరీస్ స్ట్రీమింగ్ అయ్యాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు - రాజకీయ వర్గాలు ఈ ప్రేమ కథను - పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎటువంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా దేవా కట్టా జాగ్రత్త పడ్డారట.

Also Readపవన్ లుక్స్‌ కాదు... సుజీత్ హింట్స్... 'ఓజీ' పాట 'ఫైర్ స్ట్రోమ్‌'లో హిడెన్ డీటెయిల్స్... వీటిని గమనించారా?

'మయసభ' వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోలినటువంటి రామిరెడ్డి పాత్రలో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్, హీరోగా పలు సినిమాలు చేసిన చైతన్య రావు నటించారు. రాయపాటి చక్రధర్ రావు పాత్రలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటించారు. ఆయనది ఎన్టీఆర్ రోల్.

Also Read'గాడ్ ఫాదర్' తర్వాత 15 సినిమాలు వదిలేశా... నేను డబ్బుల కోసం చేయట్లేదు: సత్యదేవ్ ఇంటర్వ్యూ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తుల జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget