OG Firestorm Song: పవన్ లుక్స్ కాదు... సుజీత్ హింట్స్... 'ఓజీ' పాట 'ఫైర్ స్ట్రోమ్'లో హిడెన్ డీటెయిల్స్... వీటిని గమనించారా?
Pawan Kalyan OG Update: 'ఓజీ' సినిమాలో మొదటి పాట 'ఫైర్ స్ట్రోమ్' విడుదలైంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, ఫిల్మ్ గురించి దర్శకుడు సుజీత్ అందులో కొన్ని హింట్స్ ఇచ్చారు. అవి ఏమిటో తెలుసుకోండి.

'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదలైంది. 'ఫైర్ స్ట్రోమ్'లో విజువల్స్, మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. తమ అభిమాన కథానాయకుడిని ఎలా చూడాలని అనుకుంటున్నామో... ఫ్యాన్ బాయ్ - దర్శకుడు సుజీత్ అలా చూపించారని సంతోషపడుతున్నారు. వాళ్ళ రియాక్షన్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజాస్ గంభీర (ఓజీ) గురించి ఈ పాటలో సుజీత్ హింట్స్ ఇచ్చారు. వాటిని గమనించారా?
'బుషిడో' అంటే... ఆ మ్యాగజైన్ చూశారా!?
'ఫైర్ స్ట్రోమ్' పాటలో ఒక టేబుల్ మీద మ్యాగజైన్ కనబడుతుంది. గమనించారా? కవర్ పేజీ మీద 'బుషిడో : ద సమురాయ్ కోడ్ ఆఫ్ జపాన్' (Bushido: The Samurai Code of Japan) అని రాసి ఉంది. బుషిడో అంటే 'ద వే ఆఫ్ వారియర్' అని అర్థం. స్పష్టంగా చెప్పాలంటే... యోధుడు / వీరుడు అనుసరించే మార్గం. జపాన్‌లోని సమురాయ్ వారియర్స్ ఫాలో అయ్యే ఫిలాసఫీని 'బుషిడో' అంటారు. అందులో మొత్తం ఏడు సూత్రాలు ఉంటాయి.

నిజాయతీ, ధైర్యం, దయ, అతిథి మర్యాద, చిత్తశుద్ధి, గౌరవం, విధేయత... 'బుషిడో' ప్రకారం వీరుడు ఈ ఏడు సూత్రాలను అనుసరించాలి. టేబుల్ మీద ఆ మ్యాగజైన్ చూపించడం ద్వారా ఓజాస్ గంభీరలో ఆ సూత్రాలను అనుసరిస్తాడని సుజీత్ హింట్ ఇచ్చారా? సినిమాలో పవన్ కళ్యాణ్ సమురాయ్ క్యారెక్టర్ చేస్తున్నారని టాక్. 'బుషిడో' బుక్ మీద ఇనాజో నీటోబే రాసినట్టు ఉంది. ఆయన జపనీస్ విద్యావేత్త.
జూలై 31తో గన్ లైసెన్స్ గడువు ముగుస్తుందా?
జపనీస్ సమురాయ్, మాఫియా & గ్యాంగ్‌స్టర్ కల్చర్ మీద ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కిస్తున్నారు సుజీత్. పాటలో ఒక విజువల్‌లో గన్ లైసెన్స్ గురించి పేపర్ ఉంటుంది. జూలై 31తో ఈ లైసెన్స్ ఎక్స్‌పైర్ అవుతుందని ఉంటుంది. అది ఎవరి గన్? ఓజాస్ గంభీరాదా? అది తెలియాలంటే లెట్స్ వెయిట్ ఫర్ సినిమా రిలీజ్!

ఇప్పటి వరకు విడుదలైన 'ఓజీ' ప్రచార చిత్రాలు చూస్తే... సినిమాలో గన్స్ ఎక్కువ ఉంటాయని అర్థం అవుతోంది. ఆ గన్స్ అన్నిటినీ సుజీత్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలిసింది. మార్కెట్టులో లభించే గన్స్ కాకుండా కస్టమైజ్డ్ గన్స్ వాడారని తెలిసింది.
Also Read: కొడుకుతో కలిసి ఒకే ఒక్క సినిమా చేసిన కోట శ్రీనివాస రావు... అది ఏమిటో తెలుసా?

లాస్ట్ బట్ నాట్ లీస్ట్... పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన క్యారెక్టర్ పేర్లు ఈ పాటలో కనిపించాయి. జానీ నుంచి మొదలు పెడితే బాలు, గబ్బర్ సింగ్ - ఇలా చాలా ఉన్నాయ్. ఆ పేర్లతో కూడిన ఫోటోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ట్వీట్ చేసింది.
A fanboy @Sujeethsign tribute 🔥https://t.co/YrLtZ9LFSq#FireStorm #OG #TheyCallHimOG pic.twitter.com/WGWAW2Dc0M
— DVV Entertainment (@DVVMovies) August 2, 2025





















