Hansika Motwani: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక - డివోర్స్ రూమర్స్ నిజమేనా?
Hansika Sohael: స్టార్ హీరోయిన్ హన్సిక తన పెళ్లి ఫోటోలను తాజాగా డిలీట్ చేశారు. దీంతో తన భర్త సోహైల్‌తో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.

Hansika Motwani Deletes Wedding Posts: స్టార్ హీరోయిన్ హన్సిక తన భర్త సోహైల్‌కు దూరంగా ఉంటున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరేలా తాజాగా ఆమె ఇన్ స్టాలో తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కొద్ది రోజుల క్రిితం హన్సిక తన తల్లి దగ్గరే ఉంటున్నారని... సోహైల్‌తో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు రాగా... ఆ ప్రచారాన్ని సోహైల్ ఖండించారు. హన్సిక మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి వెకేషన్ ట్రిప్స్‌కు వెళ్లిన ఫోటోస్ షేర్ చేసే హన్సిక... కొంతకాలంగా సింగిల్‌గానే ఫోటోస్ షేర్ చేశారు. దీంతో ఈ రూమర్లకు బలం చేకూరినట్లయింది. తాజాగా మ్యారేజ్ మూమెంట్స్ డిలీట్ చేయగా ఇద్దరూ విడిపోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
Also Read: చంద్రబాబుకు జయప్రద ప్రేమలేఖ నిజమా? 'మయసభ' కోసం రాజకీయ వర్గాలూ వెయిటింగ్... ఇందుకేనా?
2022లో ప్రియుడితో వివాహం
2022 డిసెంబర్‌లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ను వివాహం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన పెళ్లి వేడుకను 'లవ్ షాదీ డ్రామా' పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వెకేషన్ ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలను సైతం హన్సిక తన ఇన్ స్టాలో షేర్ చేసేవారు. కొద్ది రోజులుగా సింగిల్‌గానే ఉన్న ఫోటోస్ షేర్ చేస్తుండడం రూమర్లకు కారణమైంది.
సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. తన చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను సోహైల్ మొదట వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కూడా హన్సిక హాజరయ్యారు. పెళ్లైన కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో ఆమె నుంచి విడిపోయారు. ఆ తర్వాత తన మనసుకు నచ్చడంతో సోహైల్‌ను హన్సిక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తుండగా... ఈ విషయంపై సోహైల్ ఇదివరకే రియాక్ట్ అయ్యారు. తాజాగా ఫోటోలు డిలీట్ చేయడంతో ఇద్దరూ స్పందిస్తే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఫస్ట్ మూవీతోనే...
అల్లు అర్జున్ 'దేశముదురు' మూవీలో తన అందం, యాక్టింగ్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లతో నటించి స్టార్ హీరోయిన్‌గా మారారు. కంత్రి, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద, పవర్, సైజ్ జీరో, లక్కున్నోడు, మై నేమ్ ఈజ్ శృతి వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేశారు.
రీసెంట్‌గా 'గార్డియన్' మూవీలో నటించారు. త్వరలో హారర్ థ్రిల్లర్ మూవీ 'శ్రీ గాంధారి'తో అలరించబోతున్నారు. ఈ మూవీకి ఆర్ కన్నన్ దర్శకత్వం వహించగా... హిందూ ట్రస్ట్ కమిటీ హెడ్ ఆఫీసర్‌గా హన్సిక కనిపించనున్నారు. శతాబ్దాల కిందట రాజు నిర్మించిన గంధర్వ కోట పురాతన స్మారకానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ను ఆమె పరిశీలించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేదే స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.






















