Faria Abdullah: 'మత్తు వదలరా 2' తర్వాత మరో సాంగ్ కంపోజ్ చేసిన ఫరియా అబ్దుల్లా - ఆమెతో పాటు అమ్మ కూడా...
Gurram Paapi Reddy Movie: 'గుర్రం పాపిరెడ్డి' మూవీలో ఓ సాంగ్ కంపోజ్ చేసినట్లు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలిపారు. మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Faria Abdullah About Gurram Paapi Reddy Movie Song: యంగ్ హీరో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్ డార్క్ కామెడీ థ్రిల్లర్ 'గుర్రం పాపిరెడ్డి'. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
మరో సాంగ్ కంపోజ్
'మత్తు వదలరా 2' తర్వాత ఈ మూవీలో ఓ సాంగ్ కంపోజ్ చేసినట్లు ఫరియా అబ్దుల్లా తెలిపారు. ఆ పాట కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసినట్లు చెప్పారు. సినిమాలో సౌదామిని అనే పాత్రలో నటించినట్లు వెల్లడించారు. మా అమ్మ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసినట్లు తెలిపారు. నరేష్ అగస్త్య వంటి మంచి నటుడితో మూవీ చేయాలనిపించిందని... అది కూడా ఒక రీజన్ అని అన్నారు. ''గుర్రం పాపిరెడ్డి' సినిమా టీజర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. తన విజన్‌లో మమ్మల్ని భాగం చేసిన మురళీకి థాంక్స్. బ్రహ్మానందం, యోగిబాబు వంటి స్టార్లతో కలిసి నటించడం ఆనందంగా ఉంది.
మూవీ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఓ ఫ్యామిలీ మెంబర్స్‌లా చూసుకున్నారు. మా మదర్ ఈ చిత్రంలో ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీకి వర్క్ చేయడం సూపర్ ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఇందులో నేను కంపోజ్ చేసిన సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది.'
టీజర్ అదుర్స్
ఇప్పటివరకూ ఎవరూ చూడని స్టోరీతో డార్క్ కామెడీ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు మురళీ మనోహర్. మూవీలో బ్రహ్మానందంతో పాటు సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు, వంశీ, జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, జాన్ విజయ్, మెట్ట రాజేంద్రన్, ప్రభాస్ శీను కీలక పాత్రలు పోషించారు. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. మూవీని డా.సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. కామెడీ పంచులు, సస్పెన్స్ థ్రిల్లర్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
జడ్జి రోల్‌లో హాస్య బ్రహ్మ
ఈ మూవీ ఓ స్పెషల్ అని... జడ్జి పాత్రలో చేశానని హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తెలిపారు. 'డైరెక్టర్ మురళీ మనోహర్ చాలా ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. నన్ను ఈ సినిమాలో డిఫరెంట్ రోల్‌లో చూపించారు. కామెడీని పండించడంలో యోగిబాబు దిట్ట. యంగ్ స్టర్స్ అంతా కలిసి మూవీని రూపొందించగా... అందరితో కలిసి నటించడం ఓ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది.' అని చెప్పారు.
ఈ మూవీలో ప్రతీ ఒక్క క్యారెక్టర్ హీరోనే అని హీరో నరేష్ అగస్త్య తెలిపారు. బ్రహ్మానందం, యోగిబాబు వంటి స్టార్స్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకూ ఇలాంటి డిఫరెండ్ క్యారెక్టర్ తాను చేయలేదన్నారు. మూవీలో క్రైమ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు ప్రభాస్ శ్రీను. మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.





















