Aditya Haasan: సోషల్ మీడియాలో శివాజీ #90s వెబ్ సీరిస్ హవా - మీకు తెలుసా? ఆ ఓటీటీలు చిన్నచూపు చూసినా...
Aditya Haasan: ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ట్యాగ్‌తో తాజాగా విడుదలయిన వెబ్ సిరీస్ ‘#90స్’. ఈ సిరీస్ ఇటీవల ఈటీవీ విన్‌లో విడుదలయ్యి మంచి ఆదరణను సంపాదించుకోగా దీని వెనుక కష్టాన్ని దర్శకుడు బయటపెట్టాడు.
Aditya Haasan about #90s Series: ఈరోజుల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే క్రేజ్ ఎక్కువ ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు కేవలం హిందీ, ఫారిన్ భాషల్లో మాత్రమే వెబ్ సిరీస్ అనేవి పాపులారిటీని సంపాదించుకున్నాయి. కానీ ఇప్పుడు తెలుగులో కూడా మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్‌లో విడుదలయిన ‘#90స్’ కూడా అలాంటిదే. ఇక ఈ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఆదిత్య హాసన్. శివాజీ, వాసుకీ, మౌళి, రోహన్, దివ్య కీలక పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్‌కు మంచి క్రేజ్ లభిస్తుండగా.. అసలు ఈ సిరీస్‌ను స్ట్రీమ్ చేయడానికి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ చుట్టూ తిరుగుతూ పడిన కష్టాలను ఇటీవల ఆదిత్య గుర్తుచేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమయిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు.
ఇది ఈటీవీ విన్ సక్సెస్
‘‘నిర్మాత నవీన్ మేడారంకు కథ చెప్పగానే బ్యాగ్ తీసుకుంటే ఎటో వెళ్లిపోతున్నాడు అనుకున్నా కానీ ఒక చెక్ రాసిచ్చి 100 శాతం ఈ వెబ్ సిరీస్ మనం చేస్తున్నాం అన్నాడు. తర్వాత చాలా ఓటీటీలు ట్రై చేశాం. వాళ్లకు నచ్చలేదు. దానికి వాళ్లకు కూడా చాలా కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఎలాగైనా సపోర్ట్‌గా ఉంటారు. కానీ వాళ్ల తర్వాత నవీనే నాకు సపోర్ట్ చేసిన విధానం నాకు చాలా ఇష్టం. చాలా ఓటీటీలకు కథ వినిపించినా వర్కవుట్ అవ్వలేదు. అప్పుడే నాకు ఈటీవీ విన్ నుంచి ఫోన్ వచ్చింది. కథ తెలిసి ఇంకొక ఓటీటీ పిలిచింది అనుకున్నాను. వెళ్లి కథ చెప్పగానే హగ్ చేసుకొని మనం చేస్తున్నాం అన్నాడు. ఆరోజు రాత్రి కూడా అస్సలు నమ్మకం లేదు. ఆ తరువాత రోజు ఉదయం ఫోన్ చేసి అగ్రిమెంట్ గురించి మాట్లాడిన తర్వాత నమ్మకం వచ్చింది. ఇంకా ఏ ఓటీటీకి ఇది వర్కవుట్ అయ్యేది కాదు. ఇది ఈటీవీ విన్ సక్సెస్’’ అని ‘#90స్’ను ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో బయటపెట్టాడు ఆదిత్య హాసన్.
చాలా టెన్షన్ పడ్డాను
‘‘క్యాస్టింగ్ విషయానికొస్తే మౌళితో ఏదో ఒక రోజు చేస్తా నేను అని రెండేళ్ల నుంచి అనుకుంటున్నాను. నేను తనను పూర్తిగా నమ్మాను. మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నేను మాత్రం తనే కావాలని ఫిక్స్ అయ్యాను. దివ్య ఎక్స్‌ప్రెషన్స్ అయితే కరెక్ట్ ఉంటాయి. మనం ఆమెకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఆమె యాక్టింగ్ చేసేస్తుంది. రోహన్ చిన్నపిల్లోడే కానీ షో అంతా తనే ఉంటాడు. వాసుకి మేడంకు కథ చెప్పినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. అన్నింటికి థ్యాంక్స్. నాకు అక్క, చెల్లి ఎవరూ లేరు. నాకు ఒక అక్క, చెల్లి ఉంటే ఇలా ఉండాలి అనుకుంటాను. మా అమ్మ, నాన్నకు తెలియదు వాళ్లు నన్ను ఎంత ఇన్‌స్పైర్ చేశారని, అదే విధంగా వాసుకి కూడా ఇన్‌స్పైర్ చేశారు. ఫైనల్‌గా శివన్న విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆయన చాలా స్వీట్‌హార్ట్. ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పాడు ఆదిత్య.
Also Read: సుమపై శివాజీ అదిరిపోయే పంచ్‌లు - ‘సుమ అడ్డా’లో 90s టీమ్ రచ్చ, నవ్వకుండా ఉండలేరు