Upasana Kamineni Konidela: 'ఓ మై గాడ్' అది నిజం కాదు - క్లారిటీ ఇచ్చిన ఉపాసన!
కొన్ని ఛానెల్స్ ఉపాసన, రామ్ చరణ్ పాపులేషన్ ను కంట్రోల్ చేయడానికి పిల్లలను కనడం లేదంటూ థంబ్ నెయిల్స్ పెట్టాయి.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు పాల్గొనగా.. ఆ ఈవెంట్ ని మెగాస్టార్ కోడలు ఉపాసన కామినేని కొణిదెల హోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ.. కొన్ని ఛానెల్స్ ఉపాసన, రామ్ చరణ్ పాపులేషన్ ను కంట్రోల్ చేయడానికి పిల్లలను కనడం లేదంటూ థంబ్ నెయిల్స్ పెట్టాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ.. ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.
అసలు విషయంలోకి వస్తే.. సద్గురుతో మాట్లాడుతూ.. ఎబిలిటీ టూ రీ ప్రొడ్యూస్(పిల్లలను కనడం) అనే విషయం గురించి ప్రస్తావించింది ఉపాసన. దానికి ఆయన పిల్లలను కనొద్దనే చెబుతానని అన్నారు. అదే నువ్ ఒకవేళ లేడీ టైగర్ అయి ఉంటే పిల్లలను కనమని చెప్పేవాడినని.. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయని అన్నారు. మనుషుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉందని.. అది అంతరించే జాతి కాదు కాబట్టి, పిల్లలను కనకుండా ఉండటమే అందరూ చేసే సాయమని అన్నారు.
దీంతో ఉపాసన పిల్లలను కనడం లేదని కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. రామ్ చరణ్ కూడా తన కెరీర్ లో బిజీగా ఉన్నారని.. ఈ జంట పిల్లలను వద్దనుకుంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఉపాసన.. 'ఓ మై గాడ్.. అందులో నిజం లేదు.. దయచేసి వీడియో మొత్తం చూడండి. నా కాపీ చూశాక మీకు అర్ధమవుతుంది' అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లై పదేళ్లవుతున్నా రామ్ చరణ్-ఉపాసన పిల్లలను కనకపోవడంతో ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Also Read: లైవ్ లోనే సుధీర్ కి ఫోన్ - అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేనేజర్!
Also Read: మాస్ లుక్ లో 'మీటర్', క్లాసీ లుక్ లో 'రూల్స్ రంజన్'
View this post on Instagram