Bigg Boss 6: 'బిగ్ బాస్'లో ఊహించని ట్విస్ట్ - ఈ వారం ఎలిమినేషన్ లేనట్లేనా?
ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారెవరంటే.. చంటి, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, అభినయశ్రీ, శ్రీసత్య, ఆరోహి.
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పాపులర్ అయింది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. అలానే ఒక ఓటీటీ వెర్షన్ కూడా పూర్తయింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 మొదలైంది. కొత్త సీజన్ మొదలై అప్పుడే వారం రోజులు పూర్తి కావొస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారెవరంటే.. చంటి, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, అభినయశ్రీ, శ్రీసత్య, ఆరోహి.
వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై అప్పుడే అనాలిసిస్ లు కూడా మొదలయ్యాయి. ఈసారి లేడీ కంటెస్టెంట్లలో ఒకరు బయటికి వెళ్లబోతున్నట్టు టాక్స్ నడిచాయి. వారిద్దరిలో ఒకరు ఆరోహి రావు కాగా, మరొకరు ఇనయా సుల్తానా. అలాగే అభినయశ్రీ పేరు కూడా వినిపిస్తోంది. అందరికంటే వీరి ముగ్గురికి ఓట్లు తక్కువ పడ్డాయని టాక్.
అయితే ఈ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించిన బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈసారి ఎవరినీ ఎలిమినేట్ చేయాలనుకోవడం లేదట. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదు. మొదటివారం నుంచే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ అవుతుంది. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ వీక్ లో ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదట. అదే జరిగితే.. నామినేషన్స్ లో ఉన్నవారికి పండగే.
అలా అని ఈ విషయాన్ని నాగార్జున వెంటనే రివీల్ చేసే ఛాన్స్ లేదు. నామినేషన్స్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ చివరికి.. ఎలిమినేషన్ లేదని ట్విస్ట్ ఇవ్వొచ్చు. మరేం జరుగుతుందో చూడాలి. శని, ఆదివారాల్లో నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడడానికి స్టయిలిష్ గా రెడీ అయి వచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు.
Weekend fun ki siddham avvandi... With our King of entertainment🤩
— starmaa (@StarMaa) September 10, 2022
Catch today's episode at 9 PM on @StarMaa & @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/p43Q0zKCWM
Weekend fun miss avvakandi!
— starmaa (@StarMaa) September 10, 2022
Catch all the entertainment on @StarMaa & @DisneyPlusHSTel at 9 PM tonight.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/FTjKERySx7
నాగ్ నారాయణ జపం
మెరీనా - రోహిత్ జంటగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు హగ్ ఇవ్వడం లేదంటూ మెరీనా తన భర్తతో గొడవలు పడుతున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ‘రోహిత్ మా అందరి ముందు మెరీనా టైట్ హగ్ ఇవ్వు’ అని చెప్పగానే భార్యభర్తలిద్దరూ కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘నారాయణ... నారాయణ వారిద్దరూ భార్యభర్తలు’ అన్నారు నాగార్జున. దీన్ని బట్టి ఆ నారాయణ ఎవరో అర్థమయ్యే ఉంటుంది.
రేవంత్ - ఆరోహి గొడవ
రేవంత్ నువ్వు ఇంట్లో బూతులు మాట్లాడుతున్నావ్ అన్నారు నాగ్. రేవంత్ ‘నేనా’ అనగానే, ‘సాక్ష్యాలు చూపించమంటావా’ అని అడిగారు నాగ్. వెంటనే వద్దు సర్ అనేశాడు రేవంత్. ఇక ఆరోహి, రేవంత్ గొడవ గురించి లేవనెత్తారు నాగ్. ‘ఆమె ఓడిపోయిన బాధలో వస్తే అలా అనడం అవసరమా’ అని రేవంత్‌ను అడిగారు. ఆ తరువాత ఆరోహి వచ్చి రేవంత్ కు సోరీ చెబుతుంటే ఇద్దరు కామెంటేటర్లు మధ్యలో మాట్లాడడమేంటి? అని ప్రశ్నించారు. వారిద్దరికీ రివ్యూలు రివ్యూలు చెప్పి చెప్పి అలవాటైపోయింది అంటూ పరోక్షంగా ఆదిరెడ్డికీ, గీతూకి చురకలు అంటించారు.
అంత ఆలోచించకు
ఇక ఆదిరెడ్డితో మాట్లాడుతూ ‘ఆటాడుతున్నప్పుడు ఆటగాళ్లుంటారా? అంపైర్ ఉంటారా?’ అడిగారు నాగార్జున. ఆటలో ఎంపైర్ మధ్యలో తిరుగుతుంటే ఉంటే ఎలా? అని అడిగారు. దానికి ఆదిరెడ్డి ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టగానే ‘అంత ఆలోచించకు’ అంటూ సెటైర్ వేశారు. ఆటలో ఆదిరెడ్డి ఇటూ అటూ తిరుగుతుండటాన్ని ప్రశ్నించారు నాగ్. ఈ రోజు ఎపిసోడ్ మజాగా ఉండబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలిసిపోతుంది.