Nikhil Siddhartha: నిర్మాతలకు నిఖిల్ కండీషన్ - రూ.50 కోట్లు పెట్టాల్సిందే!
తనతో సినిమాలు చేయడానికి అప్రోచ్ అవుతున్న నిర్మాతలకు ఒక కండీషన్ పెడుతున్నారు నిఖిల్.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటివరకు తెలుగుకి మాత్రమే పరిమితమైన నిఖిల్ క్రేజ్.. 'కార్తికేయ2'తో బాలీవుడ్ కి పాకింది. ఈ సినిమా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవాలనుకుంటున్నారు నిఖిల్. దానికి తగ్గట్లుగా తన తదుపరి సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.
Nikhil Siddhartha's condition: Need 50 Cr budget: తనతో సినిమాలు చేయడానికి అప్రోచ్ అవుతున్న నిర్మాతలకు ఒక కండీషన్ పెడుతున్నారు నిఖిల్. సినిమా బడ్జెట్ కనీసం రూ.50 కోట్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తన నుంచి రాబోయే సినిమాలన్నీ లావిష్ గా నేషనల్ వైడ్ గా జనాలను ఆకర్షించేలా ఉండాలని నిఖిల్ భావిస్తున్నారు. అందుకే భారీ బడ్జెట్ సినిమాలే చేయాలని నిర్ణయించుకుంది.
సినిమా వర్కవుట్ అయితే రూ.50 కోట్ల పెట్టుబడి ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది. నిర్మాతలు కూడా నిఖిల్ తో ఇంత బడ్జెట్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. బడ్జెట్ ఒక్కటే కాదు.. మంచి కథ దొరికితేనే నిఖిల్ సినిమా చేయాలనుకుంటున్నారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై నిఖిల్ ఫోకస్:
ఇదివరకు '18 పేజెస్' అనే సినిమాలో నటించారు నిఖిల్. దీన్ని అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. 'కార్తికేయ2' సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు '18 పేజెస్'ను కూడా హిందీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది.
'స్పై' సినిమా రీషూట్:
'గూఢచారి', 'హిట్', 'ఎవరు' వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ బిహెచ్ ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేస్తున్నారు. ఇందులో నిఖిల్ ను హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాకి 'స్పై' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కూడా చాలా వరకు రీషూట్ చేయబోతున్నారట. కొత్తగా తాను ఒప్పుకునే సినిమాలన్నీ భారీగా ఉండాలని నిఖిల్ కోరుకుంటున్నారు.
ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'స్పై' సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా నిఖిల్ స్థాయిని పెంచుతుందేమో చూడాలి!
Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!
View this post on Instagram