Niharika Konidela: రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలాగే ఉన్నదేమో- బాబాయ్ పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan: మెగా డాటర్ నిహారికి పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో విజయం తర్వాత ఇంటికి వచ్చిన బాబాయ్ చూస్తే, యుద్ధం తర్వాత అయోధ్యకు వచ్చిన రాముడిలా అనిపించిందని చెప్పుకొచ్చింది.
Niharika Konidela On Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక నటిగానే కాకుండా, నిర్మాతగా రాణిస్తోంది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆమె ప్రొడ్యూసర్ గా వెబ్ సిరీస్ లు తెరకెక్కగా, ఇప్పుడు ఓ మూవీ రూపొందుతోంది. ‘కమిటీ కుర్రాళ్లు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆగష్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో నిహారిక ప్రమోషన్స్ షురూ చేసింది.
బాబాయ్ పవన్ కళ్యాణ్‌పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజాగా ‘కమిటీ కుర్రాళ్లు’ మూవీ ప్రమోషన్ లో భాగంగా నిహారిక ‘సర్కార్’ సక్సెస్ వేడుకల్లో పాల్గొన్నది. సుడిగాలి సుధీర్ హోస్టుగా చేస్తున్న ఈ షో ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 10 ఎపిసోడ్స్ తో సీజన్ 2ను కంప్లీట్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సక్సెస్ సెలబ్రేషన్ పేరుతో చివరి ఎపిసోడ్ ను రూపొందించారు. ఈ వేడుకల్లో నిహారిక పాల్గొంది. ఈ సందర్భంగా, ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఉన్న కూటమి పార్టీలు ఘన విజయం సాధించడం, ఆయన డిప్యూటీ సీఎం కావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ విజయం తర్వాత ఆయన పెద్ద అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ కుటుంబ సభ్యులు అందరూ సెలబ్రేషన్స్ జరుపుకున్న విజువల్స్ ను షోలో చూపించారు. ఆ విజువల్స్ చూసి నిహారిక సంతోషం వ్యక్తం చేసింది. “యుద్ధం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉన్నదేమో?” అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్న నిహారిక
ఇక మెగా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా నిహారిక సినీ కెరీర్ మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు. కొంతకాలం పాటు అడపాదడపా సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. వివాహ జీవితం కూడా అనుకున్నంత సాఫీగా ముందుకు సాగలేదు. కొద్ది రోజుల్లోనే భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. చివరకు ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యింది. ఓవైపు నటిగా కొనసాగుతూనే, మరోవైపు నిర్మాతగానూ రాణించే ప్రయత్నం చేస్తోంది. ఆమె నిర్మాతగా తెరకెక్కుతున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.