Nani: 'లయన్ లాగా ఉన్నావ్ నాన్న'.. కొడుకు వీడియో షేర్ చేసిన నాని..
హీరో నాని తన కొడుకు అర్జున్ క్యూట్ వీడియోను షేర్ చేశారు. ఇందులో అర్జున్ తన తండ్రిపై కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.
హీరో నాని అప్పుడప్పుడు తన కొడుకు అర్జున్ తో కలిసి తీసుకున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయనొక క్యూట్ వీడియోను షేర్ చేశారు. ఇందులో అర్జున్ తన తండ్రిపై కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. నా పేరేంటో తెలుసా..? అని నాని అడగ్గా.. 'శ్యామ్ సింగరాయ్' అని చెప్పాడు అర్జున్. ఆ తరువాత తన తండ్రి మీసాలను తిప్పుతూ.. 'లయన్ లాగా ఉన్నావ్ నాన్న' అంటూ తండ్రిని చూసుకొని మురిసిపోయాడు. ఈ వీడియో చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ చాలా బాగా మాట్లాడుతున్నాడని కొందరు.. 'శ్యామ్ సింగరాయ్' పెద్ద హిట్ అవుతుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక 'శ్యామ్ సింగరాయ్' సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పునర్జన్మల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబృందం పలు ప్రాంతాలకు తిరుగుతోంది. కేరళలో కూడా ప్రెస్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారని సమాచారం. అందుకే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడం లేదు. ఇక హిందీ రీమేక్ లో స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Lion la vunnavu Nanna 😉#ShyamSinghaRoy pic.twitter.com/OwKZFzJXcL
— Nani (@NameisNani) December 20, 2021
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
Also Read:బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి