(Source: ECI/ABP News/ABP Majha)
Dasara Movie: 'దసరా' నాన్ థియేట్రికల్ రైట్స్ @ రూ.47 కోట్లు!
ఈ మధ్యకాలంలో నాని నటించిన సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో 'దసరా' సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నారు.
నేచురల్ స్టార్ నాని 'దసరా' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో నాని నటించిన సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో 'దసరా' సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి క్రేజీ డీల్స్ వస్తున్నట్లు సమాచారం. డిజిటల్, హిందీ, శాటిలైట్, అడియో అన్నీ కలిపి రూ.47 కోట్ల మేరకు ఈ సినిమాకి ఆఫర్ వచ్చిందట. ఈ ప్రకారం అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారట. నాన్ థియేట్రికల్ రైట్స్ కి ఈ రేంజ్ బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి.
అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేస్తే గనుక.. థియేటర్ ఆదాయం ఎంత వచ్చినా నిర్మాతలకు లాభాలుగా మారతాయి. కానీ ఈ సినిమాకి ఖర్చు అనుకున్నదానికంటే ఎక్కువ అవుతుందట. ఒక్క పాట కోసమే ఐదొందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లను ఎంగేజ్ చేశారు. సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. అలానే ఓ ఫైట్ కోసం కోటి ఖర్చు పెట్టారు. ఇలా పరిమితులు లేకుండా బడ్జెట్ పెంచుకుంటూ పోతే మాత్రం కష్టమే.
ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్.
View this post on Instagram