X

Nani Movies: నానికి ఏమైంది? నటన అదుర్స్.. కథలూ బాగున్నాయ్.. మరి హిట్టెందుకు ముఖం చాటేస్తోందో!

నానికి టైం కలసిరావడం లేదా... ఆచి తూచి అడుగేసినా బెడిసికొడుతోందా. కథలు మంచివే అయినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్నివ్వలేకపోతున్నాయి ఎందుకు?

FOLLOW US: 

దర్శకుడు అవుదామనుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంద్రగంటి మోహనకృష్ణ అవకాశం ఇవ్వడంతో ‘అష్టాచమ్మా’తో హీరోగా నిరూపించుకున్నాడు నాని. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నాని నటించిన సినిమాలు హిట్టా-ఫ్లాపా అన్నది పక్కనపెడితే నటనపరంగా ఒక్క మైనస్ మార్క్ కూడా లేకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రేక్షకులకైతే నాని పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు. ఓ దశలో నానితో సినిమా అంటే సేఫ్ అని నిర్మాతలు ఫిక్సైపోయారు. మీడియం బడ్జెట్ సినిమాలకు, కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అయ్యాడు. ఎంత మంది హీరోలున్నా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఐదేళ్లుగా నానికి లక్కు కలసి రావడం లేదో ఏమో ఆశించిన స్థాయిలో విజయాన్నందుకోలేకపోతున్నాడు.


2017లో వచ్చిన ‘నిన్నుకోరి’ తర్వాత నానికి మంచి హిట్టు దక్కలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని, నివేదా థామస్, ఆది నటించారు. ఈ మూవీ కూడా ఆరంభంలో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాతి నుంచి న్యాచురల్ స్టార్‌కు సూపర్ హిట్ అనే మాట మఖం చాటేసింది. ‘ఎం.సి.ఎ’,’ కృష్ణార్జున యుద్దం’, ‘దేవదాస్’, ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, ‘వి’ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. నాని-సాయి పల్లవి పర్ఫార్మెన్స్  ‘MCA’ సినిమాకి ప్లస్ కావడంతో  భారీ హిట్ కాకపోయినా నిర్మాతకి మాత్రం మంచి లాభాలను తీసుకువచ్చింది. అలాగే ‘జెర్సీ’ సినిమాకు రెండు జాతీయ అవార్డులొచ్చాయి. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు కూడా దక్కించుకుంది. ఈ చిత్రం ద్వారా నానికి మంచి పేరు వచ్చింది. కానీ, నిర్మాతలకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేనట్లు టాక్. కానీ, ఇది నాని కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఐదేళ్లలో నానికి ఈ చిత్రం కాస్త ఉపశమనం కలిగించినట్లే. 


నానిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరెకెక్కిన ‘వి’ సినిమా కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఓటీటీలో రిలీజైంది. నిర్మాత దిల్ రాజుకి 10 కోట్లు లాభం వచ్చిందని ప్రచారం జరిగిన ఆ తర్వాత అది నిజం కాదన్నారు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ విషయంలోనూ అదే జరిగింది. ‘వి’ సినిమాతో పోల్చితే ‘టక్ జగదీశ్’ టాక్ పాజిటివ్ గానే ఉంది. కుటుంబ కథా చిత్రం కావడంతో ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా కూడా హిట్ అని చెప్పుకోలేని పరిస్థితి. అయతే, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వడం ద్వారా నష్టాల నుంచి తప్పించుకున్నట్లేనని తెలుస్తోంది.


వాస్తవానికి నానికి యూత్ కన్నా కుటుంబ ప్రేక్షకుల్లోనే ఫాలోయింగ్ ఎక్కువ. అదే తన బలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..సినిమా ఫెయిలైనా కథల ఎంపికలో మాత్రం నాని ఫెయిలవలేదు. కొన్నిసార్లు మంచి కథలు కూడా మంచి ఫలితాన్నివ్వవు. సినిమా హిట్టవ్వడానికి-ఫ్లాప్ అవడానికి రకరకాల కారణాలుంటాయి. కానీ జ‌డ్జిమెంట్ అనేది చాలా కీలకమైన విషయం. ఎప్పుడు ఎలాంటి క‌థ చేయాలి? ఏ ద‌ర్శ‌కుడితో చేయాలి అనే విషయం హీరోకి క్లారిటీ ఉండాలి. ఈ మధ్యకాలంలో నానికి ఆ క్లారిటీ లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఫ్లాపులకు ఇదే కారణం అంటున్నారంతా.‘కృష్ణార్జున యుద్ధం’లో నాని డ్యూయ‌ల్ రోల్ చేశాడు. క‌థ‌లో ఎలాంటి వైవిధ్యం లేకపోవ‌డం ప్ర‌ధాన బ‌ల‌హీన‌త‌. దేవ‌దాస్ మల్టీస్టారర్ అవడమే కాకుండా నాని పాత్రలు పెద్దగా ప్రాధాన్యత లేదు. `వి` అసలు నానికి నప్పే సినిమా కాదు. మరీ ముఖ్యంగా ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రకి నాని న్యాయం చేసినా.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇక ‘ట‌క్ జగ‌దీష్’లో చాలా బ‌రువైన పాత్ర. పైగా న్యాచురాలిటీకి దూరంగా నటన ఉందనే విమర్శలొచ్చాయి. ఇప్పటికైనా నాని కథల ఎంపికలో పునరాలోచించాలంటున్నారు. కామెడీ, ప్రేమకథలు తనకి బాగా నప్పుతాయి. కాస్త ఎమోషన్ యాడ్ చేస్తే నానికి ఫుల్ మార్క్సే. అలాకాదని తనకు నప్పని జోనర్లపై ఆసక్తి చూపితే ఫలితాలు ఇలానే ఉంటాయంటున్నారు.ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యాం సింగరాయ అనే సినిమాను ఇప్పటికే పూర్తిచేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే విడదలకానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు నాని కాన్సన్ ట్రేషన్ మొత్తం ఈ రెండు సినిమాలపైనే ఉంది. టక్ జగదీశ్ సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే దసరాకు నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నారట.  ‘అంటే సుందరానికి’ సినిమా సెట్స్‌పై ఉంది. ఇది కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుందని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాలతో అయినా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటే మళ్లీ పక్కింటి కుర్రాడు ఫాంలోకి వచ్చినట్టే. 


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సైఫ్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కాదు, బిగ్ స్క్రీన్‌పైనే ‘ఆదిపురుష్’ అంటూ హింటిచ్చిన రావణుడు!


Also Read: ‘లవ్ స్టోరీ’లో ఆ డైలాగ్‌తో.. తెలంగాణ ప్రభుత్వానికి సెటైర్?


Also read: అపోలో ఆసుపత్రికి కృష్ణంరాజు.. కంగారు పడొద్దన్న రెబల్ స్టార్ టీమ్


Also read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!

Tags: Tuck Jagadish Nani Movies Movies Flop V Krishnajunayuddham Devadas Gangleader

సంబంధిత కథనాలు

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt :  పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !