Krishnam Raju Health: అపోలో ఆసుపత్రికి కృష్ణంరాజు.. కంగారు పడొద్దన్న రెబల్ స్టార్ టీమ్
సెలబ్రెటీ అడుగేసినా, తీసినా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. అలాంటిది ఆసుపత్రికి వెళ్లారంటే ఇంకేమైనా ఉందా..మసాలా దట్టించి మరీ వంట వండేస్తారు. ఇదంతా చూసి రెబల్ స్టార్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.
సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. సోమవారం సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారని..తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద హడావుడే జరిగింది. ఏకంగా మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు కూడా కథలు అల్లేశారు. కానీ అసలు విషయం ఏంటంటే కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుందని.. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్లు తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు చెప్పారన్నారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.
దాదాపు ఆరు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు సేవలందిస్తున్నారు కృష్ణంరాజు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయన నట వారసుడు కాగా, రాధే శ్యామ్ మూవీలో సహనిర్మాతగా ఉన్నాడు. అలాగే ఈ మూవీలో ఓ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పాత్రకి సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ పాత్ర కేవలం తెలుగులో మాత్రమే ఉంటుందట.. మిగిలిన భాషల్లో ఆయా పరిశ్రమలకు చెందిన సీనియర్ నటులను తీసుకున్నారని అంటున్నారు. హిందీలో మిథున్ చక్రవర్తి నటిస్తున్నారట. కొద్దిరోజుల్లోనే ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్స్ రాబోతున్నాయని తెలుస్తోంది.
Also Read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!
ప్రస్తుతం కృష్ణం రాజు వయసు ఎనిమిది పదులు దాటింది. రెబల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు పొందిన కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా తెరంగ్రేట్రం చేశారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 183 సినిమాల్లో నటించారు. 1990లలో ఆయన క్రియాశీల రాజకీయాల్లోనూ సేవలందించారు. భారతీయ జనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. 1999-2004 మధ్యకాలంలో ధివంగత వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రిగా కృష్ణంరాజు సేవలందించారు. 2009లో ప్రజరాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఏదేమైనా ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని తేలడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు.
Also Read: దృశ్యం2 ఓటీటీకే వస్తుందా? విడుదల ఎప్పుడు?
Also Read: ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..
Also Read: ఇది, బన్నీ అంటే.. ఒక్క దోశకు రూ.1000 చెల్లించిన అల్లు అర్జున్, ఉద్యోగం ఇస్తానని హామీ!