News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu : ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే.. 

సోమవారం ఎపిసోడ్ లో ఉదయాన్నే 'నీ దూకుడు' సాంగ్ కి హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేసి అలరించారు.

FOLLOW US: 
Share:

సోమవారం ఎపిసోడ్ లో ఉదయాన్నే 'నీ దూకుడు' సాంగ్ కి హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేసి అలరించారు. అనంతరం శ్వేతా.. హౌస్ మేట్స్ లో కొందరు తన వెనుక మాట్లాడుతున్నారని.. హమీద, మానస్ లతో డిస్కషన్ పెట్టింది. మరోపక్క కాజల్, జెస్సీ కలిసి హౌస్ లో ఉన్న అబ్బాయిల గురించి మాట్లాడుకున్నారు. మానస్ బాగా ఫ్లర్ట్ చేస్తాడని.. శ్రీరామచంద్ర నెక్స్ట్ లెవెల్ అని కాజల్ చెప్పింది. జెస్సీని ఉద్దేశిస్తూ.. 'నువ్ కూడా బాగానే ఫ్లర్ట్ చేస్తావ్..' అంటూ కాసేపు ఆటపట్టించింది. అనంతరం సింక్ లో నాన్ వెజ్ ప్లేట్స్ కడుగుతున్నారంటూ ఉమాదేవి ఫైర్ అయింది. ఈ విషయంలో లోబో ఇన్వాల్వ్ మరింత రెచ్చ గొట్టాడు. దీంతో ఆమె లోబోను తిడుతూ కాసేపు అరిచింది. 

Team Wolf Vs Team Eagle

⦿ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ రెండు టీమ్స్ గా విడగొట్టారు బిగ్ బాస్. 
⦿ Team Wolf సభ్యులుగా ఉమా దేవి, లహరి, మానస్, జెస్సీ, రవి, సన్నీ, శ్వేతా,  నటరాజ్, కాజల్ లను ఎంపిక చేశారు. 
⦿ Team Eagle సభ్యులుగా లోబో, యానీ, శ్రీరామచంద్ర, ప్రియా, హమీద, విశ్వ, ప్రియాంక, షణ్ముఖ్, సిరి లను ఎంపిక చేశారు.  ⦿ అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ముఖాలపై రెడ్ పెయింట్ పూసి రీజన్స్ చెప్పాలి. వారి టీమ్ నుంచి కాకుండా వేరే టీమ్ లో ఉన్నవారి పేర్లు మాత్రమే చెప్పాలి. 

సిరి: ఉమాదేవిని నామినేట్ చేస్తూ.. నాన్ వెజ్ ప్లేట్స్ టాపిక్ ని రీజన్ గా చెప్పింది.  నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో రవిని తనను అనవసరంగా అపార్ధం చేసుకున్నారని అనిపించిందని చెప్పింది.

నటరాజ్: ప్రియాను నామినేట్ చేస్తూ.. తనకు మంచి చెప్పినా తప్పుగా తీసుకున్నారంటూ రీజన్ చెప్పారు. ప్రియాంకకు వంట విషయంలో ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకోదు.. కొన్ని విషయాల్లో వెంటనే రియాక్ట్ అయిపోతుందని.. అది మార్చుకోవాలని ఆమెని నామినేట్ చేశారు. 

యానీ మాస్టర్: ఉమాదేవిని నామినేట్ చేస్తూ.. రీజన్ లేకుండా ఆమె అరుస్తూనే ఉంటారని చెప్పింది. కాజల్ తో మొదటినుంచి ర్యాపో లేదని చెప్పి నామినేట్ చేసింది. 

సన్నీ: ప్రియా గేమ్ లో యాక్టివ్ గా ఉండడం లేదని నామినేట్ చేశాడు. కిచెన్ నుంచి బయటకి వచ్చి గేమ్ ఆడాలని ప్రియాంకకు సజెషన్ ఇస్తూ ఆమెను నామినేట్ చేశాడు.

ప్రియాంక: నటరాజ్ మాస్టర్ తనతో నామినేషన్ రీజన్ చెప్పిన తీరు రూడ్ గా ఉందని అతడిని నామినేట్ చేసింది. ఇక సన్నీని నామినేట్ చేస్తూ.. తనకు వంట వచ్చు కాబట్టి కిచెన్ లో ఉంటానని.. అంతేతప్ప ఆట ఎప్పుడూ ఆడకుండా లేనని చెప్పింది. 

మానస్: లోబోని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో తనకు అర్హత రాకుండా చేశారని.. తన సైకిల్ మీద ఆయిల్ వేశారని చెబుతుండగా.. లోబో సీరియస్ అయ్యాడు. తరువాత ప్రియాను నామినేట్ చేశారు. 

విశ్వ: ఉమాదేవిని నామినేట్ చేస్తూ.. ఆలూ కర్రీ మేటర్ తీసుకొచ్చాడు. దానికి ఫైర్ అయిన ఉమాదేవి బూతులు మాట్లాడింది. ఆ బూతు మాట విన్న ప్రియాంక తెగ నవ్వింది. అయినా విశ్వ-ఉమాదేవి మాటల యుద్ధం కాసేపు కొనసాగుతూనే ఉంది. అనంతరం కాజల్ ని నామినేట్ చేస్తూ తనపై నమ్మకం రావడానికి టైమ్ పడుతుందని చెప్పాడు. 

లహరి: హమీదని నామినేట్ చేస్తూ తనతో డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పింది. యానీ మాస్టర్ ను నామినేట్ చేసింది. 

హమీద: లహరిని నామినేట్ చేస్తూ.. ఇద్దరి మధ్య డిస్టర్బన్స్ రావడానికి కారణం నువ్వే అంటూ చెప్పింది. ఆ తరువాత శ్వేతాను నామినేట్ చేసింది. 

ఉమాదేవి: 'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడదానికి ట్రై చేయండి' అని సవాలు విసురుతూ యానీ మాస్టర్ ను నామినేట్ చేసింది. తరువాత విశ్వను నామినేట్ చేస్తూ మళ్లీ ఆలూ కర్రీ టాపిక్ తీసుకొచ్చింది.  'నాతో మాట్లాడాలంటే భయంగా ఉందా..?' అంటూ డైలాగ్ వేయగా.. 'అది భయం కాదు.. రెస్పెక్ట్' అంటూ యానీ మాస్టర్ ఘాటుగా బదులిచ్చింది. వెంటనే ఉమాదేవి మాటలతో యానీ మాస్టర్ ను ఏడిపించింది. తనకు ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదని.. తను ఎవరినీ అడుక్కోవడం లేదని మండిపడింది. తను మాట్లాడుతుంటే ప్రియాంక నవ్విందని ఆమెని టార్గెట్ చేయగా.. వెంటనే ప్రియాంక.. 'సరే పోవే ఉమా పో' అంటూ ఛీ కొట్టింది. దీంతో అందరూ షాకయ్యారు.  

లోబో: శ్వేతా వర్మను నామినేట్ చేస్తూ.. గేమ్ సరిగ్గా ఆడడం లేదని రీజన్ చెప్పాడు. రవిని నామినేట్ చేస్తూ.. జనాలను తెలుసు లోబో-రవి మంచి ఫ్రెండ్స్ అని.. కంటెస్టెంట్ గా నువ్ హార్డ్ ఉన్నావ్ అందుకే నామినేట్ చేస్తున్నా అని కారణం చెప్పాడు.

శ్వేతావర్మ: ఇప్పుడిప్పుడే ట్రూ కలర్స్ అనేవి తెలుస్తున్నాయని.. లోబో, హమీద మీరు ఫేక్ అంటూ మొహం మీదే చెప్పింది. ఉమాదేవి.. యానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన తీరుని తప్పుబట్టింది. ''మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి.. హ్యుమానిటీ టు హ్యుమానిటీ, విమెన్ టు విమెన్'' అంటూ స్ట్రాంగ్ గా మాట్లాడుతూనే ఎమోషనల్ అయింది. ఫేక్ జనాలంతా తనకు దూరంగా ఉండాలని.. తను ఇండివిడ్యువల్ గానే గేమ్ ఆడతానని ఇచ్చిపడేసింది. లోబో, హమీదల మొహం మొత్తం పెయింట్ పూసేయడంతో హమీద ఏడ్చేసింది. అనంతరం శ్వేతా.. ఆవేశంలో పెయింట్ పూసానని చెబుతూ హమీదకు సారీ చెప్పింది. 

షణ్ముఖ్: 'మీరు కరెక్ట్ ఏమో కానీ హౌస్ కి కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది' అంటూ ఉమాదేవిని నామినేట్ చేశాడు. 'బిగ్ బాస్ హౌస్ లో నీ క్యారెక్టర్ ఇంకా చూడలేదంటూ' జెస్సీని నామినేట్ చేశాడు. 

కాజల్: 'నిన్న నా ఫోటో చించారు.. ఈరోజు నన్ను నామినేట్ చేశారు' అంటూ యానీ మాస్టర్ ను నామినేట్ చేసింది. విశ్వను నామినేట్ చేస్తూ.. గ్రూప్స్ లో ఉండడానికే ఇష్టపడతారంటూ' రీజన్ చెప్పింది. 

ప్రియా: సన్నీను నామినేట్ చేస్తూ 'కనెక్ట్ అవ్వలేదని అన్నారు.. కానీ మీతో చాలా బాగా ఉన్నాను.. మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపించిందని' కారణం చెప్పింది. తరువాత నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేసింది. 

జెస్సీ: శ్రీరామచంద్రను నామినేట్ చేస్తూ 'బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేసినా పట్టించుకోలేదనిపించిందని' రీజన్ చెప్పాడు. లోబోను నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో సరిగ్గా ఆడలేదనిపించిందని చెప్పాడు. 

శ్రీరామచంద్ర: లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ బిహేవియర్ నచ్చలేదని అతడిని నామినేట్ చేశాడు. కాజల్ ని నామినేట్ చేశాడు. 

యాంకర్ రవి: ఏదైనా ఒక సంఘటన జరిగిన వెంటనే రియాక్ట్ అయిపోతుందంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. 'నీ మెచ్యూరిటీ నచ్చిందంటూ' శ్రీరాంచంద్రను నామినేట్ చేశాడు రవి.  

నామినేషన్ ప్రక్రియ తరువాత నటరాజ్ మాస్టర్ ఒక స్టోరీ చెప్పారు. ''ఒక గుంట నక్క మేక రూపంలో వచ్చింది.. అది ఏడుగురిని చెడగొట్టింది నాకు నామినేషన్ వేయించడానికి.. మిగిలిన బటర్ ఫ్లై, కుందేలు లాంటి వాళ్లను ఆ గుంట నక్క.. గొర్రెలుగా మార్చేసి నామినేషన్ వేయించాడు. నేను మోచేతి నీళ్లు తాగను.. అంటూ'' హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చాడు. 

⦿ ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సభ్యులు.. ఉమాదేవి, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యానీ, ప్రియా. 

Published at : 13 Sep 2021 11:25 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Bigg Boss Hamida Lobo uma devi Swetha Varma

సంబంధిత కథనాలు

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది,  నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

టాప్ స్టోరీస్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!