X

Adipurush Movie Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సైఫ్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కాదు, బిగ్ స్క్రీన్‌పైనే ‘ఆదిపురుష్’ అంటూ హింటిచ్చిన రావణుడు!

ప్రభాస్ లేటేస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ థియేటర్లో విడుదలవుతుందా.. ఓటీటీలో రానుందా. ఇలాంటి అస్సలు వద్దే వద్దంటున్నాడు సైఫ్ అలీఖాన్. ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

FOLLOW US: 

కరోనాకి ముందు ఆ తర్వాత అన్నంతగా ఇండస్ట్రీలో పరిస్థితి మారిపోయింది. గతంలో థియేటర్లలో సందడి చేశాక ఓటీటీవైపు చూసే సినిమాలు ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ప్రతివారం థియేటర్లతో పోటీ పడుతూ ఓటీటీలో వచ్చేస్తున్నాయ్. ఇలాంటి సమయంలో అనవసర డిస్కషన్స్‌కి ఛాన్స్ ఇవ్వకుండా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు సైఫ్ అలీఖాన్.ప్రస్తుతం తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీస్ లో ప్రభాస్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస గాథ ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే 45 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి సైఫ్ అలీఖాన్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటిటి రిలీజ్ ఉండదని ఓంరౌత్ ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై చూసే విధంగా తెరకెక్కిస్తున్నాడని తెలిపాడు. జస్ట్ చిన్న చిన్న స్క్రీన్లలో చూసే సినిమా అయితే ఇది కాదు. ఈ సినిమాలో చాలా సాలిడ్ విజువల్స్ ఉన్నాయి. వాటిని బిగ్ టికెట్‌పై చూసి ఎంజాయ్ చెయ్యాలని పేర్కొన్నాడు సైఫ్.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి రోజురోజుకు ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. అయితే డార్లింగ్‌ ప్రభాస్‌ ఇప్పుడు మునుపటి లుక్‌ను కోల్పోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫిట్‌గా ఉండే ప్రభాస్‌ అంకుల్‌లా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో హడావుడి నడిచింది. దీంతో రాముడి క్యారెక్టర్ కోసం ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో కనిపించాలంటే కష్టపడక తప్పదని ఫిక్సయ్యాడట. అందుకే సరైన లుక్ కోసం యూకేలో ఓ డాక్టర్‌ సమక్షంలో ప్రభాస్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నారట. వరల్డ్ క్లాస్ డాక్టర్,  డైటీషన్ వద్ద ప్రభాస్‌ అత్యుత్తమ చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

Also Read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!

గతంలో `బాహుబలి` సినిమాలో రెండు రకాల పాత్రల్లో వేరియేష‌న్స్‌ను చూపించేందుకు ప్ర‌భాస్ బ‌రువు పెరగడం తగ్గడం చేశాడు. `సాహో` కోసం మళ్ళీ స్లిమ్ గా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌`ల కోసం లుక్‌ మారుస్తున్నాడు.  షేప్‌ ఔట్‌ కావడానికి ఇదికూడా ఓ కారణం. అందుకే  కంటిన్యూగా `ఆదిపురుష్‌` కోసం ప్రత్యేకంగా ఈ డైట్‌ తీసుకోబోతున్నాడని టాక్. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు సలార్, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీకి కూడా కమిటయ్యాడు. ఏదేమైనా ఇప్పుడు ‘ఆదిపురుష్’ థియేటర్లలోనే విడుదల కానున్నదని క్లారిటీ వచ్చేసింది.

Also Read: దృశ్యం2 ఓటీటీకే వస్తుందా? విడుదల ఎప్పుడు?

Also Read: ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..

Tags: Prabhas radhesyam Salar OTT Release Adipurush Adipurush Movie Update Ravan Saif Ali Khan krithi Sanon

సంబంధిత కథనాలు

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt :  పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !