By: ABP Desam | Updated at : 18 Oct 2021 12:06 PM (IST)
(Image credit: Instagram)
టక్ జగదీష్ సినిమాతో కుటుంబ ప్రేక్షకుల మరింత దగ్గరయ్యాడు నాని. థియేటర్లలో విడుదల చేసే వీలులేక అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో దీన్ని విడుదల చేశారు. మంచి పాజిటివ్ టాక్ సాధించింది ఈ సినిమా. టక్ జగదీష్ తరువాత విడుదలవ్వబోతున్న నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఆ మూవీ. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నాని అభిమానులు పండుగ చేసుకునే అప్డేట్ ఇది. శ్యామ్ సింగరాయ్ ను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుక థియేటర్లలోకి విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. నాని, సాయి పల్లవి కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేసింది.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రధాన హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తుండగా, సెకండ్ నాయికగా కృతిశెట్టి కనిపించబోతోంది. ఇక మరో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఓ కీలకపాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతోంది. కాగా సినిమా విడుదల అవ్వకుండా దీని డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుక్కున్నట్టు టాక్. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ 40 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. ‘టాక్సీవాలా’ సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్, ఈ సినిమాకు దర్శకుడు.
శ్యామ్ సింగరాయ్ ను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలచేయనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
This Christmas
Shyam will arrive where he belongs :)
To the big screen and to your hearts 🤍
TELUGU,TAMIL,MALAYALAM,KANNADA
DECEMBER 24th 🔥#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8 — Nani (@NameisNani) October 18, 2021
Also read: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
Also read: ఈ అయిదు తినండి చాలు... చర్మం మెరిసిపోవడం ఖాయం
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
Also read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!