News
News
X

NKR19: కల్యాణ్ రామ్ తాజా సినిమా టైటిల్ ఫిక్స్, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

నందమూరి కల్యాణ్ రామ్ 19వ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘అమిగోస్’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది.

FOLLOW US: 

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న నందమూరి కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాతో అదిరిపోయే మైలేజ్ అందుకున్నాడు. అదే ఊపులో వరుస సినిమాలు చేస్తున్నాడు. తన కెరీర్ లో 19వ మూవీగా ఈ చిత్రం NKR19 తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ కావడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఈ మూవీకి  ‘అమిగోస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వినడానికే వెరైటీగా ఉన్న ఈ టైటిల్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేందర్ రెడ్డి దర్శకత్వం  వహిస్తున్నారు. ఈ సినిమాలో  హీరోయిన్ గా కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ నటిస్తోంది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని కూడా సినిమా యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది(2023) ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

‘అమిగోస్’లో మూడు పాత్రలు చేస్తున్న కల్యాణ్ రామ్

News Reels

ఇక ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను చూస్తే కల్యాణ్ రామ్‌లో మూడు షేడ్స్‌ను గమనించవచ్చు. దీన్ని బట్టి ఆయన ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లు చేస్తున్నట్లు అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ‘బింబిసార’ సినిమాలో రెండు పాత్రలు పోషించిన ఆయన, ఈ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పిస్తాడని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొనసాగుతుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.

వరుస సినిమాలు చేస్తున్న కల్యాణ్ రామ్

ఇక కల్యాణ్ రామ్ ఇతర సినిమాల విషయానికి వస్తే ‘NKR20’  టైటిల్ వర్క్ తో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్ మీదకు అడుగు పెట్టింది.  ‘డెవిల్’ అనే మరో సినిమాలో కూడా కల్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. అటు ‘NKR21’ మూవీగా ఈ సినిమా  అభిషేక్‌ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ కథాంశంతో ‘డెవిల్’ రూపొందుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ‘NKR22’ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది. మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానుంది. మొత్తంగా నందమూరి కల్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!

Published at : 07 Nov 2022 12:12 PM (IST) Tags: Nandamuri Kalyan Ram NKR19 Aminos Movie First Look poster

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

YS Sharmila : లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?

YS Sharmila :  లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?