By: ABP Desam | Updated at : 01 Apr 2022 02:33 PM (IST)
నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ లెటర్
ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూ.. ఉదయం 9 గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. రేపు(ఏప్రిల్ 2) ఉదయం 11 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయన మృతిపట్ల నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయనొక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఏమని రాసుందంటే.. ''ఆయన నాకు మంచి ఆప్తుడు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనతో నేను 'వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు' సినిమాలు చేశాను. ఈరోజు ఆయన మరణవార్త నన్ను బాధించింది. మంచి మనిషి, నిస్వార్ధపరుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాను'' అంటూ తెలిపారు.
దర్శకుడు శరత్ దాదాపు ఇరవై సినిమాలకు దర్శకత్వం వహించారు. 'చాదస్తపు మొగుడు' అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన సుమన్, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేశారు. హీరో సుమన్ తో సుమన్ తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు వంటి సినిమాలు తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణతో 'సూపర్ మొగుడు' అనే సినిమాను కూడా రూపొందించారు.
Also Read: లైంగిక వేధింపుల కేసు - 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్ పై చార్జ్‌షీట్
Natasimham #NandamuriBalakrishna expressed his deepest condolences on the sudden demise of Senior Director #Sarath pic.twitter.com/UPYVflVQTg
— BA Raju's Team (@baraju_SuperHit) April 1, 2022
Rest in peace #Sarath garu. Our sincere condolences and prayers to his family.
— Sridevi Movies (@SrideviMovieOff) April 1, 2022
Indebted to him for giving us a blockbuster hit 'Vamsanikokkadu' 🙏 pic.twitter.com/lGGdu4GwLY
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్