News
News
X

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

నటి నమిత కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

FOLLOW US: 

సినీ నటి నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఆగస్టు 6వ తేదీనే కవలలను ప్రసవించినా.. ఈ సమాచారాన్ని ఆలస్యంగా ప్రకటించారు. శుక్రవారం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నమిత, ఆమె భర్తతో కలిసి ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో వారు తమ కవల పిల్లలను ఎత్తుకుని కనిపించారు. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ.. తమకు కవల పిల్లలు పుట్టారని, ఇద్దరు మగ పిల్లలేని తెలిపారు. దీంతో ఆమె అభిమానులు నమిత దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. 

నమిత ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. గర్భానికి ముందు ఆమె చివరిగా తమిళ ‘బిగ్ బాస్’లో కనిపించారు. మే నెలలో తన పుట్టిన రోజు సందర్భంగా తాను గర్భవతినంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ఫాలోవర్లకు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. అయితే, నమిత ఈ నెల ఆగస్టు 6న కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఆ రోజు కూడా నమిత కార్లో ప్రయాణిస్తూ పరోక్షంగా తన ప్రసవం గురించి వెల్లడించారు. కానీ, ఏ విషయం చెప్పలేదు. 
 
నమిత ఏపీకి చెందిన మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నమిత తమ బిడ్డలను ఎత్తుకుని వారిని ఆశ్వీరదించాలని కోరారు. ‘‘హరే కృష్ణ! ఈ శుభ సందర్భంలో సంతోషకరమైన వార్తను మీ అందరితో పంచుకోడానికి సంతోషిస్తున్నాం. మాకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు అబ్బాయిలే. మీ ఆశీర్వాదాలు, ప్రేమ వారికి ఎల్లప్పుడూ ఉంటాయని మేం ఆశిస్తున్నాం.   ప్రెగ్నెన్సీ సమయంలో నాకు మార్గనిర్దేశం చేసిన, ప్రసవానికి సాయం చేసిన డాక్టర్ భువనేశ్వరి, ఆమె బృందానికి నేను రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు. 

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?

View this post on Instagram
 
A post shared by Namita Vankawala Chowdhary (@namita.official)

Published at : 19 Aug 2022 11:15 PM (IST) Tags: Namitha Namitha Blessed Namitha Twins Namitha twin Baby Boys

సంబంధిత కథనాలు

Chiranjeevi: అప్పట్లో అభిమానుల్లో విపరీతమైన ద్వేషం ఉండేది, అందుకే పార్టీ కల్చర్ తీసుకొచ్చా: చిరంజీవి

Chiranjeevi: అప్పట్లో అభిమానుల్లో విపరీతమైన ద్వేషం ఉండేది, అందుకే పార్టీ కల్చర్ తీసుకొచ్చా: చిరంజీవి

Samantha: 'రా' ఏజెంట్‌గా సమంత - భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్!

Samantha: 'రా' ఏజెంట్‌గా సమంత - భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్!

GoodBye Movie Review - 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా

GoodBye Movie Review - 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు