Mrunal Thakur: మెగాస్టార్ మూవీలో ఛాన్స్, ‘సీతారామం’ బ్యూటీ దశ తిరిగినట్టేనా?
అందాల తార మృణాల్ ఠాకూర్ అదిరిపోయే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
‘సీతారామం’ మూవీ తర్వాత మృణాల్ ఠాకూర్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత ఆమె ఫుల్ బిజీ అయ్యారు. తాజాగా మృణాల్ చక్కటి అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపొందబోతోంది. సోషియో ఫాంటసీ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు మలుచబోతున్నారట. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. మృణాల్ అయితేనే ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలదని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే, ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్లు తెలుస్తోంది.
మృణాల్ దశ తిరిగినట్లేనా?
ఇక ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినీ లవర్స్ లో బాగా ఆసక్తి కలిగిస్తోంది. ‘విశ్వానికి మించి..’ అంటూ విడుదలైన ఆ పోస్టర్‌లో పంచభూతాలను చూపించారు. ఈ పోస్టర్ ద్వారా రాబోయే చిత్రం ఎంత అద్భుతంగా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత గొప్ప చిత్రం మృణాల్ కు అవకాశం లభిస్తే, ఆమె కెరీర్ అద్భుతంగా ముందుకు సాగడం ఖాయం అని భావిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రెండు సినిమాల్లో నటిస్తున్న మృణాల్ ఠాకూర్
ప్రస్తుతం చిరంజీవి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంతో పాటు వశిష్ఠ మూవీ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇక మృణాల్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. నానితో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. 'దసరా'లో రా అండ్ మాస్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన నాని.. ఈసారి క్లాస్ గా కనిపించబోతున్నాడు. విజయ్ దేవరకొండతో కలిసి మరో మూవీలో నటిస్తోంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందుతోంది. సంక్రాంతికి 'ఫ్యామిలీ స్టార్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత 'దిల్' రాజు ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా. విజయ్ దేవరకొండతో, 'దిల్' రాజు నిర్మాణంలో మొదటి సినిమా.
Read Also: పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి! 'గుంటూరు కారం'లో సెకెండ్ హీరోయిన్ గా శ్రీలీల?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial