News
News
వీడియోలు ఆటలు
X

‘రామబాణం’ మాస్ ట్రీట్ - ‘మోనాలిసా’ సాంగ్ చూశారా?

శ్రీవాస్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న హీరో గోపీచంద్ లేటెస్ట్ ఫిల్మ్ రామబాణం నుంచి తాజాగా ఓ మాస్ ట్రీట్ అందింది. ఈ మూవీలోని 'మోనాలిసా మోనాలిసా లిరికల్ వీడియో సాంగ్' రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

FOLLOW US: 
Share:

Rama Banam : టాలీవుడ్ హీరో గోపీచంద్, డింపుల్‌ హయతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి 'మోనాలిసా మోనాలిసా లిరికల్ వీడియో సాంగ్' రిలీజ్ అయింది. తాజాగా మేకర్స్ లాంఛ్ చేసిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాయగా.. మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో శ్రీకృష్ణ, గీతామాధురి పాడారు. ఈ సాంగ్‌ దినేష్‌ కుమార్‌ కొరియోగ్రఫీలో మాస్‌ బీట్‌తో ఎనర్జిటిక్‌గా సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందించిన ‘రామబాణం’ నుంచి ఇప్పటికే విడుదలైన పలు పాటలకు మంచి స్పందన వస్తోంది. దాంతో పాటు సినిమా పోస్టర్స్, ట్రైలర్, టీజర్స్.. మూవీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా.. మంచి కమర్షియల్ ఫార్మాట్ తో అద్భుతమైన ఎమోషన్స్ తో సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గతంలో 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్స్ తో అలరించిన గోపీచంద్.. వినోదం, ఫ్యామిలీ కలగలిపిన ‘రామబాణం’తో మే 5న థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. 'లక్ష్యం' తర్వాత గోపీచంద్ మరోసారి జగపతిబాబుతో కలిసి నటించనుండడంతో ఆయన ఫ్యాన్స్.. ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విశ్వాసంతోనే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ వేడుకలోనూ 'రామబాణం' సినిమా అందరికీ నచ్చుతుందని గోపీచంద్ చెప్పారు.

ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రామబాణం' మూవీ నుంచి లేటెస్ట్ గా రిలీజైన 'మోనాలిసా మోనాలిసా లిరికల్ వీడియో సాంగ్' ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో గోపీచంద్, డింపుల్ హయతీ తమ డ్యాన్స్ తో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ను అందిస్తున్నారు. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో గోపీచంద్ సూపర్ క్లాస్‌గా కనిపించగా.. డింపుల్... తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఇక శ్రీ కృష్ణ, గీతా మాధురి అందించిన స్వరాలు.. ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. సెన్సార్ సభ్యులు ఈ సినిమా విషయంలో పాజిటివ్ గా స్పందించారని వార్తలు కూడా వచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా.. అన్ని వర్గాల వారికి నచ్చుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
 
'రామబాణం'లో గోపీచంద్, డింపుల్ హయతీ పాటు ఖుష్బూ సుందర్‌, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక గోపీచంద్ సినిమా విషయానికొస్తే..2021లో 'తొలివలపు' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఒకప్పుడు 'వర్షం', 'యజ్ఞం' లాంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత ప్లాఫ్ లను చూడాల్సి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో ఫెయిల్ అయ్యాయి. 

Read Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!

Published at : 01 May 2023 07:42 PM (IST) Tags: gopichand Dimple Hayati Rama Banam Srivasu Mona Lisa Mona Lisa Song Mass Treat

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !