Mohan Babu Trolls: ఇద్దరు హీరోలు ట్రోల్ చేయిస్తున్నారు - 100 మందిని పెట్టి మరీ - మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు!
మోహన్ బాబు కొత్త సినిమా సన్ ఆఫ్ ఇండియా ప్రమోషన్లలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను ఇద్దరు హీరోలు దగ్గరుండి ట్రోల్ చేయిస్తున్నారని, దాని కోసం ప్రత్యేకంగా 100 మందితో టీమ్ కూడా పనిచేస్తుందని ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్లలో తన పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై మాట్లాడారు.
సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ని తెలిసిన వాళ్లు తనకు పంపిస్తుంటారని తెలిపారు. ఒక్కోసారి వాటిని చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంటుందన్నారు. ట్రోల్స్ అంటే నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదన్నారు. తనను ట్రోల్ చేస్తున్న ఆ హీరోలు ఎవరో కూడా తెలుసని, వాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు... కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని కామెంట్స్ చేశారు.
ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తుంది. మరిన్ని ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.
View this post on Instagram
View this post on Instagram