అన్వేషించండి

Unstoppable 4: సినీ అభిమానులకు క్రేజీ న్యూస్, బాలయ్య షోకు చీఫ్ గెస్టుగా చిరంజీవి!

Chiranjeevi | బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ షోకు గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Unstoppable 4: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అయిన ఈ షో, ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించింది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. త్వరలో మరో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ సీజన్ లో సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. గత సీజన్లకు మంచి ఈ సీజన్ ప్రేక్షకులను అలరించనున్నట్లు  తెలుస్తోంది.

దసరా నుంచి కొత్త సీజన్ ప్రారంభం?

‘అన్ స్టాపబుల్’ సీజన్ 4కు సంబంధించి ఆహా ఇప్పటికే ప్రకటన చేసింది. త్వరలోనే ఆహా సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. అయితే, ఎప్పటి నుంచి ఈ సీజన్ మొదలవుతుంది? అనే విషయాన్ని కచ్చితంగా వెల్లడించలేదు. అయితే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ దసరాకు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

‘అన్ స్టాపబుల్’ చీఫ్ గెస్టుగా చిరంజీవి

ఇక ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి, బాలయ్య మాస్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు చాలా ఏండ్ల పాటు స్టార్ హీరోలుగా కొనసాగారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొంటే సినీ అభిమానులకు కన్నుల పండుగ కానుంది. అయితే, చిరంజీవితో పాటు నాగార్జున కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే ఈ విషయంపై ఆహా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.  

ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

‘అన్ స్టాపబుల్’ షోలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బాలయ్య  అడిగే ఫన్నీ ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ షోలో చంద్రబాబు నాయుడు, కిరణ కుమార్ రెడ్డి, లోకేష్ లాంటి నాయకులు పాల్గొని సందడి చేశారు. అటు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, గోపీచంద్, రవితేజ సహా పలువురు సినీ ప్రముఖుల పాల్గొన్నారు. సీజన్ 4లో ఎవరు గెస్టులుగా రాబోతున్నారు? అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈసారి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియన్ స్టార్లు ఈ షో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆహా నుంచి ఫుల్ క్లారిటీ రానుంది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తోన్నారు NBK 109 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: మరోసారి గ్లామర్ మెరుపులు మెరిపించిన ‘అఖండ’ బ్యూటీ- ప్రగ్యా అందాలకు కుర్రకారు పరేషాన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget