News
News
X

Sankranthi War: మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ ప్లాన్స్ - మెగాస్టార్ సపోర్ట్!

చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడమంటే చిన్న విషయం కాదు.

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇదివరకు చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. చిరంజీవి-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతోంది. ఇందులో రవితేజ(Raviteja) కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మరోపక్క బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. 

గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుందని ప్రకరించారు. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం సహజమే కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. 'ఆదిపురుష్', వారసుడు' లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఇప్పుడు చిరు, బాలయ్య కూడా తోడైతే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. 

ఈ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడమంటే చిన్న విషయం కాదు. నిజానికి బాలయ్య సినిమాను దసరాకి లేదంటే డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. 

చిరు, బాలయ్య సినిమాలను ఒకేరోజు కాకుండా.. రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ చేస్తే మంచిదని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సినిమాను జనవరి 10న, బాలయ్య సినిమాను జనవరి 12న రిలీజ్ చేసేలా ప్లాన్ వేసుకున్నారట. దీనికి చిరు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. రిలీజ్ కి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. డేట్ క్లాష్ పై బజ్ ఓ రేంజ్ లో నడుస్తోంది. 

News Reels

దీపావళికి చిరు సినిమా అప్డేట్:
చిరంజీవి-బాబీ సినిమాలో హీరో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. దీనిపై ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

బాలయ్య సినిమా విషయానికొస్తే.. దీనికి 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy) టైటిల్ ఖరారు చేశారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ భామ హానీ రోజ్ ఓ పాత్రలో కనిపించనుంది. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్

Published at : 22 Oct 2022 07:32 PM (IST) Tags: Balakrishna Sankranthi war Mytri Movie Makers Chiranjeevi

సంబంధిత కథనాలు

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య

Surya on Prabhas: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై