అన్వేషించండి
Chiranjeevi: కదల్లేని స్థితిలో కైకాల - బర్త్ డే సెలబ్రేట్ చేసిన మెగాస్టార్
ఈరోజు కైకాల పుట్టినరోజు కావడంతో బెడ్ పైనే ఆయనతో కేక్ కట్ చేయించారు చిరు.

కదల్లేని స్థితిలో కైకాల - బర్త్ డే సెలబ్రేట్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వయసు రీత్యా చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కైకాల. మొన్నామధ్య ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆయన దగ్గరకు చిరంజీవి స్వయంగా వెళ్లారు.
కైకాల పుట్టినరోజు కావడంతో బెడ్ పైనే ఆయనతో కేక్ కట్ చేయించారు చిరు. ఈ సందర్భంగా కైకాలతో తీసుకున్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ''పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను'' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ ఇప్పుడు 'గాడ్ ఫాదర్'తో అలరించబోతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అలానే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్ రమేష్, వెంకీ కుడుములతో సినిమాలు చేయబోతున్నారు చిరంజీవి.
View this post on Instagram
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆధ్యాత్మికం
హైదరాబాద్
ప్రపంచం





















