(Source: ECI/ABP News/ABP Majha)
Ginna Movie Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా, లోడ్ చేసిన గన్ను, ‘జిన్నా’ ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు నటించిన తాజా సినిమా 'జిన్నా'. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దసరా కానుగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరెక్కిన తాజా మూవీ 'జిన్నా'. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినమా ఈ నెల 21న విడుదలకాబోతున్నది. ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పాటలు ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. కాగా, ఈ మూవీకి సంబంధించి అఫిషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను దసరా పండుగ కానుకగా బుధవారం రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
“జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు రా.. లోడ్ చేసిన గన్ను.. టచ్ చేస్తే దీపావళే” అంటూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో మంచు విష్ణు టెంట్ హౌస్ నడుపుతుంటాడు. ఊర్లో వాళ్లందిరి దగ్గర అప్పులు చేస్తుంటాడు. పనిలో పనిగా ఈ సినిమాలోని విలన్ దగ్గర కూడా వడ్డీకి అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఈ ట్రైలర్ మొదలైన వెంటనే మంచు విష్ణు కామెడీతో అలరిస్తాడు. ఆయనకు తోడుగా వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం అదరిపోయే పంచులు విసురుతారు. వీరందరినీ చూస్తుంటే ఈ సినిమాలో ఫుల్ కామెడీ నింపబోతున్నట్లు తెలుస్తున్నది. కమెడియన్ సద్దాం డైలాగులు అదుర్స్ అనిపించాయి. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సన్నీ లియోన్ అందాల ఆరబోత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. మంచు విష్ణు ఎమోషనల్ డైలాగులు సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. “నాకు దుడ్లు ముఖ్యమే.. కానీ, నా అనుకునేవాళ్లు నాకు దుడ్లు కన్నా ఎక్కువ ముఖ్యం” అనే డైలాగ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. ఆడియెన్స్ కు దసరా విషెస్ చెప్తూ మంచు విష్ణు ఈ ట్రైలర్ ను తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
Happy Vijayadashami🏹to my dear brothers and sisters.
— Vishnu Manchu (@iVishnuManchu) October 5, 2022
Excited to share #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫💥
Telugu▶️ https://t.co/qtsDro1qBr
Hindi▶️ https://t.co/3zeX5SFGti
Malayalam▶️ https://t.co/av820DQXWK@SunnyLeone @starlingpayal #GinnaOn21stOct💥 #HappyDussehra🏹 pic.twitter.com/KoS2puTdrg
వాస్తవానికి ఈ సినిమా దసరా బరిలో నిలవాల్సి ఉండేది. కానీ, చిరంజీవి ‘ గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో వాయిదా వేశారు. అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 'జిన్నా' విడుదల అవుతుంది. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను .. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. రక్షిత్ మాస్టర్ ఈ మూవీకి కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.