Malvi Malhotra: అతడితో కంఫర్టబుల్ గా ఫీలయ్యాను- రాజ్ తరుణ్ గురించి మాల్వీ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Malvi Malhotra Telugu News: రాజ్ తరుణ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో చాలా కంఫర్టబుల్ గా ఫీలైనట్లు వెల్లడించింది.
Malvi Malhotra About Raj Tarun: టాలీవుడ్ లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు మార్మోగిపోతోంది. రాజ్ తరుణ్ తో ఆమె డేటింగ్ చేస్తున్న అతడి ప్రియురాలు లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కోసమే తనను దూరం పెట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల్వి, రాజ్ తరుణ్ ను తనకు దూరం చేస్తుందంటూ ఆరోపించింది. ఈ క్రమంలో మాల్వి మల్హోత్రా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘తిరగబడరా సామి’ చిత్రంలో రాజ్ తరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా గడుపుతోంది. కానీ రాజ్ తరుణ్ లవర్ లావణ్య చేసిన చేసిన కామెంట్స్ తో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
తరుణ్ తో కంఫర్ట్ గా ఫీలయ్యా- మాల్వి
తాజాగా మాల్వి రాజ్ తరుణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తిరగబడరా సామి’ ప్రమోషన్ లో భాగంగా, రాజ్ తరుణ్ తనతో ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చింది. “రాజ్ తరుణ్ తో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా ఇబ్బందిగా ఫీల్ కాలేదు. నాకు చాలా సపోర్టు చేసేవాడు. చాలా మ్యెచూర్డ్ గా ఉండేవాడు” అని వివరించింది. తరచుగా తెలుగు సినిమాలు చూస్తానని, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న కారణంగా ‘కల్కి 2898 AD’ సినిమా చూడలేదని, త్వరలోనే చూస్తానని చెప్పింది. మాల్వి ‘తిరగబడరా సామి’ సినిమా కంటే ముందు హిందీలో, మలయాళంలో సినిమాలు చేసింది.
ఇంతకీ మాల్వి మల్హోత్రా ఎవరంటే?
ఇక మాల్వి మల్హోత్రా హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వి చండీగఢ్ లోనే చదివింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో మాస్టర్స్ చేసింది. నటన పట్ల ఇష్టంలో టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. 2017లో 'ఉడాన్' అనే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత వెండితెరపై దర్శనం ఇచ్చింది. అనంతరం 'హోటల్ మిలన్' అనే సినిమాతో సిల్వర్ స్ర్కీన్ మీద కనిపించింది. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ చిత్రాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. 2023లో 'అభ్యుహం' అనే మలయాళం మూవీలో నటించింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో కలిసి 'తిరగబడరా స్వామి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరణ్ ప్రియురాలు కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
లావణ్య ఆరోపణలు ఏంటంటే?
లావణ్య.. రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మల్హోత్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ ని తనకు కాకుండా చేయాలని మాల్వీ ప్రయత్నం చేస్తుందని చెప్పింది. తనను చంపి డెడ్ బాడీ కూడా దొరక్కుండా చేస్తానని బెదిరించిందని వెల్లడించింది. అటు గత 10 సంవత్సరాలుగా తనతో రిలేషన్ లో ఉండి, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేశాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ బంధువులు కూడా తనను బెదిరిస్తున్నారని చెప్పింది.ఆమె ఆరోపణలను పూర్తిగా ఖండించిన రాజ్ తరుణ్, ఆమెపై లీగల్ యాక్షన్ కు రెడీ అవుతున్నాడు. మాల్వితో ఎలాంటి రిలేషన్ షిప్ లేదని వెల్లడించాడు. అటు తనను అనవసర వివాదంలోకి లాగిన లావణ్యపై మాల్వి పరువునష్టం దావా వేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: హీరో రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ..