T20 World Cup 2026: శ్రీలంక ఓటమితో ఆసక్తిగా గ్రూప్-2 సెమీ-ఫైనల్ సమీకరణాలు! పాకిస్తాన్‌కు బిగ్‌షాక్ ఇచ్చిన న్యూజిలాండ్!
T20 World Cup 2026: శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం గ్రూప్ 2లో సంచలనం సృష్టించింది. శ్రీలంక ఓటమి పాకిస్తాన్ సెమీ-ఫైనల్ బెర్తుకు పెద్ద దెబ్బ తగిలింది.

T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026లో సూపర్ 8 మ్యాచ్ బుధవారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగింది. న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది, పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో తన స్థానానికి మరింత బలోపేతం చేసుకుంది. కాబట్టి పూర్తి సెమీ-ఫైనల్ సమీకరణాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
శ్రీలంక ఓటమితో పాకిస్థాన్ కు బిగ్‌షాక్.
గ్రూప్ 2లో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమి పాకిస్తాన్‌కు తీవ్ర దెబ్బ తగిలింది. సెమీఫైనల్ బెర్తుకు పాకిస్తాన్ చేరుకోవాలంటే కివీస్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచింది, దీంతో పాకిస్తాన్ సెమీఫైనల్ సమీకరణాలు మరింత క్లిష్టమయ్యాయి.
ఈ ఓటమితో శ్రీలంక నిష్క్రమించింది. గ్రూప్ 2లో, సెమీఫైనల్ స్థానం కోసం పోటీ ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య ఉంది. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.
న్యూజిలాండ్ విజయం పాకిస్తాన్‌ను ఇబ్బంది పెట్టింది
న్యూజిలాండ్ -పాకిస్తాన్ రెండూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. న్యూజిలాండ్ మూడు పాయింట్లతో ఉండగా, పాకిస్తాన్ కేవలం ఒక పాయింట్‌తో ఉంది. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లను గెలిస్తే, న్యూజిలాండ్ ఐదు పాయింట్లతో అర్హత సాధిస్తుంది, పాకిస్తాన్ కేవలం మూడు పాయింట్లతో నిష్క్రమిస్తుంది.
న్యూజిలాండ్ ఓడితేనే పాకిస్తాన్‌కు ఛాన్స్
న్యూజిలాండ్ చివరి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కివీస్ ఓడిపోతే, లేదా పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో శ్రీలంకను ఓడిస్తే, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు చెరో 3 పాయింట్లు కలిగి ఉంటాయి. అప్పుడు నికర రన్ రేట్ ఆధారంగా నిర్ణయం ఉంటుంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందో అనే ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకోవడానికి ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. చివరి మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.




















