Illu Illalu Pillalu Serial Today February 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ నగల్లో నర్మద.. శ్రీవల్లీ భారీ ప్లాన్! కారు బుకింగ్‌లో ట్విస్ట్, ఎమోషనల్ మూమెంట్!
Illu Illalu Pillalu Serial Today Episode February 26th నర్మద ప్రేమ నగలు వేసుకొని పార్టీకి వెళ్లడం, ధీరజ్ ప్రేమ పేరు మీద కారు బుక్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ ప్రేమని తీసుకొని కారు కొనడానికి వెళ్తాడు. నర్మద ఇంట్లో ప్రేమ లేదని కాల్ చేసి ప్రేమ జంట ఇంట్లో లేరు కదా ఎక్కడికి వెళ్లారు అని అంటుంది. ధీరజ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.. కారు డ్రైవింగ్ మానేసి కారు కొనడానికి తీసుకొచ్చాడని చెప్తుంది. కారు అంటే చాలా డబ్బులు అవుతాయి కదా అని నర్మద అడిగితే ధీరజ్ చెప్పినా వినడం లేదు అని ప్రేమ అంటుంది. ప్రేమ ఇంటికి వచ్చి మొత్తం చెప్తాను అంటుంది. ఇక నర్మద నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. తర్వాత పార్టీ గురించి చెప్పి రమ్మని అంటుంది. డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేయమని అంటుంది. తర్వాత నగలు అడుగుతుంది. డైరెక్ట్‌గా తీసుకొ అక్క అడగటం ఏంటి.. నువ్వు నా నగలు వేసుకుంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది.
శ్రీవల్లి పార్టీకి రెడీ అయిపోతుంది. భాగ్యం కూతురితో నువ్వు పార్టీలో పావులు కదుపు.. నేను ఇంట్లో ఉండి నర్మద కోరలు పీకేస్తా అంటుంది. మనల్ని చెంప దెబ్బ కొట్టిన వాళ్లకి తిరిగి చావు దెబ్బ కొడితే ఆ కిక్కే వేరప్ప అని వల్లీ అంటుంది. వేదవతి రెడీ అయి వస్తుంది. నర్మద వాళ్లకోసం అడిగుతుంది. అప్పుడే సాగర్ షూట్ బూటు వేసి రెడీ అయి నర్మద అందంగా రెడీ అయి వస్తుంది. వేదవతి కొడుకుతో ముందే మీ నాన్నతో నీ ఉద్యోగం గురించి చెప్పుంటే ఈ పార్టీ మన ఇంట్లోనే ఏర్పాటు చేసుండేవాళ్లు కదా అంటుంది. ఇక వల్లీ నర్మదతో ఈ నగలు ప్రేమ నగలే కదా అంటుంది. దానికి భాగ్యం లాగా కాదు ప్రేమ నగలే.. రెండు కుటుంబాల మధ్య కురుక్షేత్రం సృష్టించిన నగలు అవి అందరికీ గుర్తుంటాయి అని అంటుంది. ఇక నర్మద నగలు మా పుట్టింట్లో ఉండిపోయావని అంటుంది. నర్మద వాళ్లు పార్టీ కోసం వెళ్లిపోతారు.
భాగ్యం సాగర్‌కి ఉద్యోగం ఇచ్చిన బ్రోకర్‌కి కాల్ చేసి లొకేషన్ పంపాను అక్కడికి రా డబ్బు ఇస్తా అని చెప్తుంది. ఇక ప్రేమ, ధీరజ్‌లు కారు బుకింగ్ చేస్తారు. ప్రేమకి ఏ మాత్రం నచ్చదు.. కారు 15 లక్షలు అని అంటారు. అడ్వాన్స్‌గా 20 వేలు అడిగితే ధీరజ్ ఇవ్వలేడు అని అనుకుంటుంది. కానీ ధీరజ్ 20 వేలు ఇస్తాడు. కారు ఎవరి పేరు మీద అంటే వీడి పేరు మీదే అని ధీరజ్ అని చెప్తుంది. కాదు అని అంటాడు. తర్వాత వేదవతి, రామరాజుల పేర్లు చెప్పినా ధీరజ్ కాదు అంటాడు. చివరకు కారు ప్రేమ పేరు మీద బుక్ చేయమని అంటాడు. ప్రేమ షాక్ అయిపోతుంది. నా పేరు మీద వద్దురా అని ప్రేమ అంటుంది. నీ పేరు మీదే తీసుకుంటా.. మా నాన్న ఏం చేసినా మా అమ్మ పేరు మీదే చేస్తాడు. మా నాన్నకి మా అమ్మ ఎలాగో నాకు నువ్వు అలా అని అంటాడు. ప్రేమ చాలా హ్యాపీగా ఫీలై ఎమోషనల్ అవుతుంది. ధీరజ్ నుదిటి మీద ముద్దు పెట్టి హగ్ చేసుకొని నేను అంటే నీకు ఎంత ప్రేమరా జీవితాంతం ఇలాగే చూసుకుంటావురా అని అడుగుతుంది. నీకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఆపలేం అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ పేరు మీద కారు బుక్ చేస్తారు. డెమో ఉందని అనడంతో ధీరజ్ ప్రేమ కారు ఎక్కి చూస్తారు. ధీరజ్ ప్రేమతో కారు నీ పేరు మీద ఎందుకు బుక్ చేశానో తెలుసా రేపు ఈఎమ్‌ఐ నువ్వే కట్టాలి అంటాడు. దాంతో ప్రేమ ధీరజ్‌ని వెంట పడి కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
వృషభ రాశివారికి పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందా? 2026 ఉగాది పంచాంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి























