Maayon Movie Teaser: కట్టప్ప తనయుడి ఫస్ట్ మూవీ టీజర్ విడుదల చేసిన బళ్లాల దేవ
సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ' మయోన్' సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు.ఈ మూవీ తెలుగు టీజర్ రానా చేతులమీదుగా విడుదలైంది.
బాహుబలిలో కట్టప్పగా, మిర్చిలో ప్రభాస్ తండ్రిగా మెప్పించిన సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నిటిస్తోన్న సినిమా "మాయోన్''. కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మధ్య విడుదల చేసిన తమిళ టీజర్ క మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రానా చేతుల మీదుగా తెలుగు టీజర్ లాంచ్ చేశారు మేకర్స్ .
Delighted to unveil the telugu teaser of #Maayon. Must say it looks quite interesting and I can't wait to watch the full movie.Wishing the Maayon team all the very best. https://t.co/vkBiOqt5Lv@ManickamMozhi @DoubleMProd_ @Sibi_Sathyaraj @actortanya @RamprasadDop #Ilaiyaraaja
— Rana Daggubati (@RanaDaggubati) October 9, 2021
Also Read: సమంత తల్లికావాలనుకుంది..కానీ ఆ ఒక్కనెలలో ఏం జరిగిందంటే..'శాకుంతలం' నిర్మాత షాకింగ్ కామెంట్స్
'స్వర్ణ మద్యం జల క్రీడించి.. సేదతీరే తధాక తీరం చనుధించారు..' అనే గ్రాంథిక డైలాగ్స్ తో మొదలైంది. ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక దేవాలయం మిస్టరీని చేధించే కథాంశంతో ఈ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ రూపొందినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. కెమెరామెన్ రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్, ఇళయరాజా సమకూర్చిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగింది 'మాయోన్' టీజర్.
Also Read: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..
''మాయోన్'' టీజర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన రానా మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. ''#Maayon తెలుగు టీజర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. పూర్తి సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, చిత్ర బృందానికి శుభాకాంక్షలు'' అని రానా ట్వీట్ చేశాడు. అరుణ్ మోజీ మనిక్కమ్ ఈ చిత్రానికి నిర్మాత.
Also Read: కెప్టెన్ గా ప్రియా.. కాజల్ ని కావాలనే కార్నర్ చేసిన హౌస్ మేట్స్..
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి