Bigg Boss 5 Telugu: కెప్టెన్ గా ప్రియా.. కాజల్ ని కావాలనే కార్నర్ చేసిన హౌస్ మేట్స్..
యానీ మాస్టర్, ప్రియా, శ్వేతా, రవి కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ నలుగురికీ 'పదివేలు సరిపోవు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారంలో వాతావరణం వేడెక్కింది. రెండు రోజుల పాటు హౌస్ లో 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే టాస్క్ నడిచింది. ఇప్పుడు ఆ టాస్క్ లో విజేతలుగా నిలిచిన రవి టీమ్ నుంచి యానీ మాస్టర్, ప్రియా, శ్వేతా, రవి కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ నలుగురికీ 'పదివేలు సరిపోవు సోదరా' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులకు నాలుగు రంథ్రాలు ఉండే నీటి ట్యాంక్లను ఇచ్చారు. వారికి సపోర్ట్ చేసే సభ్యులు ఆ ట్యాంక్ రంథ్రాలు మూసి నీళ్లు బయటకు పోకుండా సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్‌కు షణ్ముఖ్‌ను సంచాలకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు.
- శ్వేతా - కాజల్ ని సెలెక్ట్ చేస్తూ.. 'నాకు, సన్నీ, యానీ మేడం మధ్య స్నేహం ఉంది.. టాస్క్ వల్ల మేమేం మారిపోము.. దయచేసి ఇన్ఫ్లుయెన్స్ చేయకండి' అని రీజన్ ఇచ్చింది.
- జెస్సీ - ''ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోమని తనతో అనడం నాకు నచ్చలేదు. నాకు కుకింగ్ రాదు, నన్ను కుకింగ్ కి రమ్మంటారేంటి?' అంటూ శ్రీరామ్ తో వాదించాడు జెస్సీ.
- షణ్ముఖ్ - విశ్వని సెలెక్ట్ చేసుకొని.. కెప్టెన్సీ టాస్క్ లో ఇష్టమొచ్చినట్లు అరవడం, చిల్లర్ అని అనడం నచ్చలేదని రీజన్ చెప్పాడు.
- హమీద - కెప్టెన్సీ టాస్క్ లో ఫ్లిప్ అవ్వడం నచ్చలేదని కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసింది.
- సిరి - విశ్వను సెలెక్ట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో కోపంలో మాట్లాడిన పదాలు నచ్చలేదని రీజన్ చెప్పింది.
- శ్రీరామచంద్ర - కాజల్ ని సెలెక్ట్ చేస్తూ.. జెస్సీతో గొడవ పెద్దది కావడానికి కారణం నువ్వే అంటూ వరస్ట్ పెర్ఫార్మర్ గా ఆమెని ఎన్నుకున్నాడు
- కాజల్ - శ్రీరామచంద్ర ని సెలెక్ట్ చేస్తూ.. ఏదో పురుగుని చూసినట్లు చూస్తున్నావ్ అంటూ రీజన్ చెప్పింది.
- యానీ మాస్టర్ - పాజిటివ్ వైబ్ రావడం లేదని కాజల్ ని సెలెక్ట్ చేసింది.
- ప్రియాంక - కెప్టెన్సీ టాస్క్ లో వాడిన పదాలు నచ్చలేదని రీజన్ చెప్పింది.
- లోబో - కెప్టెన్సీ టాస్క్ లో రవిని వెన్నుపోటు పొడవడం నచ్చలేదని కాజల్ ని సెలెక్ట్ చేశాడు.
- రవి - కాజల్ ని సెలెక్ట్ చేస్తూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, 'ఎవరిమీద చెయ్యెత్తకు, నొప్పయితది, పద్ధతి తెలుసుకో' అంటూ రవి అనగానే 'నువ్వు నాకు పద్దతులు నేర్పక్కర్లేదు' అంటూ వాదించింది కాజల్. దానికి రవి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా 'నీ పీరియడ్లు క్లాసులో పెట్టుకో ఈడ కాదు' అంటూ రవి మధ్యలోనే కాజల్ ని మాట్లాడనివ్వకుండా చేశాడు.
- మానస్ - శ్రీరామచంద్ర ని సెలెక్ట్ చేస్తూ.. సంచాలక్ గా నీ ప్రవర్తన నచ్చలేదని రీజన్ చెప్పాడు.
- సన్నీ - శ్రీరామచంద్రను సెలెక్ట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో 'మట్టిలో మల్లయుద్ధం' టాస్క్ కావాలనే ఆడలేదని.. అలానే జెస్సీని కావాలనే కొట్టాడని రీజన్ చెప్పాడు.
- విశ్వ - కాజల్ ని సెలెక్ట్ చేశాడు.
- ప్రియా - విశ్వని సెలెక్ట్ చేశాడు.
Also Read: కొండ పొలం సమీక్ష: మట్టివాసన చూపించే సినిమా.. వైష్ణవ్ మళ్లీ కొట్టాడా?
Also Read: అతడు ఒక్క రోజు కూడా షూటింగ్‌కు సమయానికి రాలేదు.. ‘మా’ ఎన్నికలపై కోటా వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి