అన్వేషించండి

Polimera 2 Teaser: ‘ప్రాణాలు తీస్తే తప్పు కానీ బలిస్తే తప్పేముంది’ - ‘పొలిమేర 2’ టీజర్ వచ్చేసింది!

సత్యం రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’ టీజర్ వచ్చేసింది.

2021లో డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన ‘మా ఊరి పొలిమేర’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘పొలిమేర 2’ని కూడా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో విడుదల అవుతుందా? అన్నది తెలియరాలేదు. 

ఇక టీజర్ విషయానికి వస్తే...

రెండో భాగానికి సినిమా స్పాన్ మరింత పెంచినట్లు అర్థం అవుతుంది. మొదటి భాగం పూర్తిగా ఒక ఊరిలోకే జరుగుతుంది. ఈసారి వేర్వేరు లొకేషన్లలో సినిమా తెరకెక్కించారు. ఒక గుడి నేపథ్యంలో జరిగే కథ అని ఒక ప్రాథమిక అంచనా అయితే వచ్చింది. ‘మనిషిని చంపడం తప్పు కానీ బలిస్తే తప్పేముంది’ లాంటి డైలాగ్స్ కూడా సినిమాలో ఉన్నాయి. గెటప్ శ్రీను, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల క్యారెక్టర్ల లుక్స్‌ను రివీల్ చేశారు.

ఇక 'మా ఊరి పొలిమేర 2' సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవివర్మ, చిత్రమ్ నటించారు. శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా, నిర్మతగా గౌరీకృష్ణ వ్యవహరించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌పై గౌర్ క్రిస్నా నిర్మించిన ఈ చిత్రాన్ని ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్‌లోని అనేక సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. మా ఊరి పొలిమేర 2 షూటింగ్ 2022లో ప్రారంభం కాగా.. మూవీ చిత్రీకరణ పూర్తయినట్లు ఇటీవలే చిత్ర నిర్మాతలు ధృవీకరించారు.

'మా ఊరి పొలిమేర 2' మొదటి భాగం కంటే రాబోయే రెండో భాగం మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఈ ఏడాది మే లో రిలీజ్ చేశారు. మంటల మధ్యలో ఓ వ్యక్తి అటుగా తిరిగి నమస్కరిస్తుండగా.. అతని తలపై నుంచి రక్తం ప్రవహించడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

నటుడు, ఈ చిత్రంలో కథానాయకుడు 'స‌త్యం' రాజేశ్ మాట్లాడుతూ ''గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'మా ఊరి పొలిమేర'ను ప్రేక్షకులు ఎంతో ఆద‌రించారు. దానికి సీక్వెల్‌... 'మా ఊరి పొలిమేర 2' త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్నిఅదే విధంగా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. ద‌ర్శ‌కుడు అనిల్ అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాత గౌరికృష్ణ నిర్మాణంలో రాజీ పడలేదు'' అని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget