Liger First Review: 'లైగర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు 'లైగర్' సినిమాకి రివ్యూ చెప్పేశారు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ వచ్చేసింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు 'లైగర్' సినిమాకి రివ్యూ చెప్పేశారు.
Liger First Review: 'లైగర్' సినిమా సిటీమార్ మాస్ ఎంటర్టైనర్ అని, విజయ్ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడని.. యాక్షన్స్ స్టంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని, సూపర్బ్ డైరెక్షన్ అని రాసుకొచ్చారు. రమ్యకృష్ణ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని.. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే ఏవరేజ్ గా ఉన్నాయని తెలిపారు. మరి ఉమైర్ సంధు చెప్పినట్లుగానే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి!
#Liger is Citii Maar Mass Entertainer. #VijayDeverakonda is One Man Show. He Stole the Show all the way. Terrific Action Stunts & Direction. #RamyaKrishnan is Surprise Package. Story & Screenplay is Average.
— Umair Sandhu (@UmairSandu) August 23, 2022
⭐⭐⭐
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. అయితే ఈ సినిమాకి సెన్సార్ టీమ్ ఏడు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది, కొన్ని చోట్ల మ్యూట్ వేయాల్సి వచ్చింది. నిడివిలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.
List of Objections & Cuts from Censor Board: సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం.. సినిమాలో ఓ బ్రిటీష్ నోవలిస్ట్ డైలాగ్ ను వాడుకున్నారు. దాన్ని హిందీలోయాడ్ చేశారు. టైటిల్ కార్డును కూడా యాడ్ చేశారు. ఇక 48 నిమిషం దగ్గర 'సైకిల్ తోకో' అనే పదాన్ని మ్యూట్ చేశారు. ఆ తరువాత ఆరు సార్లు 'ఫ*' అనే పదాన్ని మ్యూట్ చేశారు. వీటితో పాటు కుతియా అనే పదాన్ని గంట మూడో నిమిషం దగ్గర మ్యూట్ చేశారు. 'కే లవ్' అనే మాటను కూడా మ్యూట్ చేశారు. ఇవి కాకుండా 'వో తేరీ చాతతా హై..' అనే డైలాగ్‌ను 'లెజెండ్ తేరా చెంచా..' అనే డైలాగ్‌తో మార్చారు.