అన్వేషించండి
Advertisement
Krithi Shetty : ఈ హీరోయిన్ కోసం కుర్రహీరోల క్యూ!
కుర్ర హీరోల పక్కన ఆమె బాగా సూట్ అవుతుండడంతో అందరూ ఆమె కోసం క్యూ కడుతున్నారు.
గతేడాది 'భీష్మ' సినిమాతో ఆకట్టుకున్న హీరో నితిన్ ఈ ఏడాది 'చెక్', 'రంగ్ దే' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెడుతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.
అయితే ఇంకా ఈ విషయంలో ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇదిలా ఉండగా.. నితిన్ ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 'ఉప్పెన' సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న కృతిశెట్టి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. నానితో 'శ్యామ్ సింగరాయ్', సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' లాంటి సినిమాల్లో ఆడిపాడుతోంది. నాగచైతన్య నటిస్తోన్న 'బంగార్రాజు' సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికోసం ఆమెకి దాదాపు రూ.75 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
కుర్ర హీరోల పక్కన ఆమె బాగా సూట్ అవుతుండడంతో అందరూ ఆమె కోసం క్యూ కడుతున్నారు. పైగా తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసేసింది. దీంతో ఆమెని తమ సినిమాల్లో తీసుకోవడం వలన ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆమె ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా.. కూడా నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పుడు నితిన్ సినిమాలో కూడా కృతిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ దర్శకుడిగా మారి సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో నితిన్ కి కొన్ని నెలల క్రితం కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసినప్పటికీ ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ముందుగా నితిన్.. వక్కంతం వంశీ సినిమాను పూర్తి చేయబోతున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా పట్టాలెక్కనుంది. డిఫరెంట్ లవ్ స్టోరీతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఏడాదిలోపు సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత శేఖర్ తో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో పేరున్న ఆర్టిస్ట్ లను తీసుకోబోతున్నారు. విలన్ గా కూడా పాపులర్ యాక్టర్ ని అనుకుంటున్నారట. కాల్షీట్స్ ను బట్టి తారలను ఫైనల్ చేయనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రైమ్
నిజామాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion