Krishna Mukunda Murari July 3rd: రేవతి ఆన్ ఫైర్- డైరీ అమ్మాయి ముకుందేనని కృష్ణ కనిపెట్టేస్తుందా?
కృష్ణని ప్రేమిస్తున్నానని ముకుందకి మురారీ చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మురారీ వాళ్ళ కంటే ముందుగానే ముకుంద ఇంటికి చేరుకుంటుంది. అలేఖ్య వాళ్ళు ఎదురుపడి పలకరిస్తే కుషన్ వాళ్ళ గురించి ఏమి తెలియనట్టు అడుగుతుంది. వాళ్ళ కళ్ళు గప్పి మకుంద డైరీ తీసుకుని మురారీ గదిలోకి వెళ్తుంది. సిగ్నేచర్ మార్పు ఉండాలి కదా అనుకుని ముకుంద కవిత్వం రాసి దాని కింద నీ ముకుంద అని సైన్ చేస్తుంది. దాన్ని కృష్ణ చూడాలని కావాలని ముకుంద రాసి సైన్ చేసిన చోట పెన్ను ఉంచి బుక్ ఓపెన్ చేసి తన బట్టల్లోనే పెడుతుంది. మధుకర్ మురారీ గదికి వెళ్ళగా, ముకుంద గదికి అలేఖ్య వెళ్ళి వెతుకుతారు. ముకుంద గదిలో ఐలవ్యూ మురారీ అని రాసి ఉన్న బుక్ ని అలేఖ్య తీసుకుని చూస్తుంది. ముకుంద మురారీని ప్రేమిస్తుందని మధుకర్ తో చెప్తుంది.
ALso Read: రాకేష్ తలపగలగొట్టిన అప్పు- రాజ్ కి ఆఫీసు వర్క్ లో సాయం చేసిన కావ్య
మురారీ రాగానే డైరీ చూసి నా కవిత చదువుతాడు. కనీసం వన్ మినిట్ నా ప్రేమ గురించి ఆలోచించినా చాలు దాన్ని శాశ్వతం చేస్తాను. అసలు డైరీ చూశానంటే మురారీకి కోపం వస్తుందా? లేదంటే కృష్ణని ప్రేమించింది చదివాను అంటే గిల్టీగా ఫీలవుతాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రేవతి డల్ గా ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ అమ్మని చూసి వస్తున్నానని అనుకున్నారు ఫేస్ డల్ గా పెట్టుకోవాలని అనుకుంటుంది. రేవతి వచ్చి అమ్మకి ఎలా ఉందని ఆరా తీస్తుంది. కాసేపటికి కృష్ణ, మురారీ ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు మన మీద అమ్మ కోప్పడుతుంది. తను కోపంలో ఏమైనా అంటే పట్టించుకోవద్దని చెప్తాడు. నన్ను మరీ పరాయి దాన్ని చేస్తున్నారు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అంటుంది. ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టగానే రేవతి ఎదురుపడి ఆగండని అరుస్తుంది. ఉగ్రరూపం దాల్చిన కాళీ మాతలా ఉందని మురారీ భయపడతాడు.
రేవతి: కృష్ణ నువ్వు కాసేపు మాట్లాడకు అసలే కోపంగా ఉన్నాను. నువ్వు ఏంట్రా తలదించుకుని ఉన్నావ్. మీకు కష్టపడి లీవ్ శాంక్షన్ చేయించి ఫామ్ హౌస్ కి పంపిస్తే వారం తిరగకుండానే ఎందుకు వచ్చారు
మురారీ: ఏమర్జెనీ మిషన్ అని కమిషనర్ ఫోన్ చేస్తే వచ్చాం
రేవతి: అవునా అయితే కమిషనర్ కి ఫోన్ చెయ్యి నేను అడుగుతాను
మురారీ: నేను చెయ్యను మమ్మీ అంత అనుమానం ఏంటి?
రేవతి: అవును నీ మీద నాకు డౌట్ నిన్ను నమ్మను, కృష్ణని నమ్ముతాను. ఇప్పుడు చెప్పు నిజంగానే మిషన్ లేదంటే అబద్ధం చెప్తున్నాడా?
Also Read: మహేంద్ర వాళ్ళ చెంతకి చేరిన ఫణీంద్ర- దాచినా దాగని రిషి ప్రేమ, ఎంతైనా జెంటిల్మెన్ కదా!
కృష్ణ: నిజమే అత్తయ్య ఆయన చెప్పమంటే అబద్దం చెప్తానా?
మురారీ గదిలో కూర్చుని ఆలోచిస్తుంటే కృష్ణ వస్తుంది. ఏసీపీ సర్ ఎందుకంత డిస్ట్రబ్ అవుతున్నారో అర్థం కావడం లేదనుకుని పలకరిస్తుంది. కానీ మురారీ మౌనంగా ఉంటాడు. నీ ఒడిలో తలపెట్టుకుని మనసులో ఉన్నదంతా చెప్పుకోవాలని ఉందని అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని చూస్తుంటే దగ్గరకి తీసుకుని ఓదార్చాలని ఉంది కానీ నాకు ఆ అదృష్టం లేదని కృష్ణ బాధపడుతుంది. తర్వాత కృష్ణ బట్టలు సర్దుతుంటే మురారీ డైరీ గమనిస్తాడు.