LSD 2 Release Date: ‘LSD 2’లో కీలక పాత్రలో ట్రాన్స్ జెండర్, ఇంతకీ ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Know Background of Trans woman, LSD 2 Fame Bonita: ఏక్తా కపూర్ నిర్మించిన చిత్రం ‘LSD 2’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానునుంది. ఇందులో ట్రాన్స్ మహిళ కీలక పాత్ర చేసింది. తన బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?
Meet Trans Woman Bonita As Kullu - Love Sex Aur Dhokha 2 Update: ఏక్తా కపూర్ నిర్మాతగా 2010లో ‘LSD’ సినిమా విడుదల అయ్యింది. ఆ చిత్రంలో రాజ్ కుమార్ రావు, నేహా చౌహాన్, అన్షుమాన్ ఝా, నుష్రత్ బరూచా కీలక పాత్రలు పోషించారు. ALT ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్, ప్రియా శ్రీధరన్ సంయుక్తంగా నిర్మించారు. పరువు హత్య, MMS స్కాండల్, స్టింగ్ ఆపరేషన్ అనే మూడు వేర్వేరు కథలను కలిపి సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘LSD 2’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దిబాకర్ బెనర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక అప్ డేట్స్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్రభావం భారీగా పెరిగిన నేపథ్యంలో యువతీ యువకులు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ఎలా పరిచయం అవుతున్నారు? ఎలా ప్రేమలో పడుతున్నారు? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో తుషార్ కపూర్, మౌని రాయ్, ఉర్ఫీ జావేద్ నటిస్తుండగా, ఇప్పుడు మరో ప్రధాన పాత్రలో నటించబోయే యాక్టర్ ను ఏక్తా కపూర్ పరిచయం చేసింది.
‘LSD 2’లో కీలక పాత్ర పోషిస్తున్న ట్రాన్స్ జెండర్
బోనితా రాజ్ పురోహిత్ అనే ట్రాన్స్ ఉమెన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఏక్తా కపూర్ వెల్లడించింది. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఆమె నటనలో ఎలా శిక్షణ తీసుకుంది? తన పాత్రను ఎలా కంప్లీట్ చేసింది? అనే విషయాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బోనితా రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్. ఆమెను పరిచయం చేయడంతో పాటు ఆమె ఇంటిని, తల్లిదండ్రులను చూపించారు. ‘LSD 2’ సినిమాలో ఆమె కులు పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో షేర్ చేసి, బోనితాను ‘LSD 2’ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు.
View this post on Instagram
ఏప్రిల్ 19న ‘LSD 2’ విడుదల
‘LSD 2’ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, కల్ట్ మూవీస్ సమర్పణలో ఏక్తా కపూర్, శోభా కపూర్ సినిమాను నిర్మిస్తున్నారు. దిబాకర్ బెనర్జీ చివరిగా దర్శకత్వం వహించినచిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. ఇందులో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా నటించారు. 2021లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ‘LSD 2’తో మరో సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు.
Read Also: బాక్సాఫీస్ దగ్గర టిల్లుగాడి ధూమ్ ధాం, 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!