Tillu Square Box Office: బాక్సాఫీస్ దగ్గర టిల్లుగాడి ధూమ్ ధాం, 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!
టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. 9 రోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. వరుస సెలవులు ఉండటంతో మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.
Tillu Square becomes Siddhu Jonnalagadda's first 100cr film: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. రెండేళ్ల క్రితం వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సిద్ధు స్వయంగా కథ, డైలాగ్స్ అందించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టిల్లు యాక్టింగ్, డైలాగులు అందరినీ భలే ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతం అంటూ ప్రశంసించారు.
9 రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ
‘టిల్లు స్క్వేర్’ సినిమా విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. సిద్ధు కెరీర్ లోనే తొలిసారి అద్భుతమైన ఫీట్ ను అందుకున్నాడు. కేవలం రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తక్కువ సమయంలో రూ. 100 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 9 రోజుల్లో ఈ సినిమా రూ 100.4 కోట్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓ రేంజిలో జోరు కొనసాగిస్తోంది. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది.
View this post on Instagram
ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాపూ అద్భుతం అంటూ అభినందించారు. ప్రేక్షకుల అంచనాలు అందుకుంటూ ‘టిల్లు స్క్వేర్’తో మరోసారి అద్భుత విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఇక ‘టిల్లు స్క్వేర్’ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. ‘డీజే టిల్లు’ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నేహా శెట్టి ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించింది. ప్రిన్స్, మురళీధర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
Read Also: ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?