అన్వేషించండి
Advertisement
HBD Kiara Advani: బాలీవుడ్ టు టాలీవుడ్.. నెక్స్ట్ సూపర్ స్టార్ కియారానే!
కియారా సినిమాల ప్లానింగ్ ని చూస్తుంటే బాలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.
యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ స్టార్ గా మారింది. ఆమె ఎన్నుకుంటున్న సినిమాలు కియారాకు మంచి పేరు తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా చాలా బోల్డ్ గా తయారైంది. అందాల ఆరబోతతో పాటు శృంగార సన్నివేశాలలో కూడా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా నటిస్తోంది. అందుకే దర్శకనిర్మాతలకు కియారా బెస్ట్ ఛాయిస్ గా మారింది. అంతేకాదు ఆమె నటించిన 'కబీర్ సింగ్'(Kabir Singh) రూ.300 కోట్లు వసూలు చేసింది. ఆమె భాగమైన 'గుడ్ న్యూస్'(Good News) సుమారుగా రూ.250 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ కు హాట్ ఫేవరెట్ గా మారింది ఈ ముంబై ముద్దుగుమ్మ. ఈ సుందరి నేడు(జూలై 31) పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..
కరోనా టైమ్ లో కియారా హవా :-
కరోనా సమయంలో స్టార్స్ నటించిన సినిమా విడుదలలు ఆగిపోతే.. కియారా సినిమాలు మాత్రం థియేటర్లలో ఓటీటీ వేదికలలో సందడి చేశాయి. ఆమె నటించిన 'గిల్టీ', 'లక్ష్మీ' లాంటి సినిమాలు ఓటీటీలో విడుదల కాగా.. 'ఇందూ కి జవానీ' థియేటర్ లో విడుదలైంది. అందరూ తమ సినిమాలను థియేటర్ లో విడుదల చేయడానికి భయపడుతున్న సమయంలో కియారా మాత్రం ధైర్యంగా తన సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసి షాకిచ్చింది.
బాలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్ :-
కియారా సినిమాల ప్లానింగ్‌ని చూస్తుంటే బాలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ హీరోగా 'భూల్ భులెయ్యా 2' అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తోంది. 2007లో వచ్చిన 'భూల్ భులెయ్యా'కి ఇది సీక్వెల్. అలానే ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'షేర్‌షా' అనే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది కియారా. దర్శకుడు శశాంక్ ఖైతాన్ రూపొందిస్తోన్న పూర్తిస్థాయి కామెడీ సినిమా 'మిస్టర్ లేలే'కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 'కర్రమ్ కుర్రమ్' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా అలానే 'జగ్ జగ్ జీయో' అనే రొమాంటిక్ కామెడీ చిత్రాలలో కనిపించనుంది.
సిద్ధార్థ్ తో స్పెషల్ బాండింగ్ :-
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఓ సినిమా చేస్తోన్న కారణంగా కియారాకు అతడితో మంచి బాండింగ్ ఏర్పడింది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే సంగతి మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు, పార్టీలకు వెళ్లడంతో విషయం బయటకొచ్చింది. కియారా కూడా సందర్భం వచ్చిన ప్రతీసారి సిద్ధార్థ్ ను పొగుడుతూ ఉంటుంది. ఇప్పటివరకు తను కలిసి పని చేసిన వాళ్లలో సిద్ధార్థ్ చాలా ఇంటెలిజెంట్ అని.. చాలా ఫోకస్డ్ గా ఉంటారని చెబుతూ ఉంటుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
రాజమండ్రి
హైదరాబాద్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement