Karthika Deepam January 23rd: గన్ ఫైర్- వంటలక్క, డాక్టర్ బాబు చనిపోతారా? 'కార్తీకదీపం' సీరియల్ కి 'శుభం' కార్డ్ ఇదేనా?
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తోన్న కార్తీక దీపం సీరియల్ కి నేటితో ముగింపు పలికారు. క్లైమాక్స్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
హిమని కాపాడుకోవడానికి దీప, సౌందర్య, కార్తీక్ అందరూ మోనిత ఇంట్లోకి వస్తారు. అక్కడ మోనిత హిమ తలకి గన్ గురి పెట్టి కార్తీక్ తో పెళ్లి చేస్తే తనని వదిలేస్తానని బెదిరిస్తుంది. దీంతో దీప అలాగే నువ్వు అదిగినట్టే డాక్టర్ బాబుతో నీ పెళ్లి చేస్తాను హిమని ఏమి చెయ్యొద్దు అని చేతులు జోడించి వేడుకుంటుంది. అది నిజమని మోనిత సంతోషపడుతూ ఉంటే దీప ఒక్కసారిగా తన చేతిలోని గన్ లాగేసుకుని హిమని సౌందర్య వాళ్ళకి ఇస్తుంది. దీప ప్రవర్తనతో ఒక్కసారిగా షాక్ అయిన మోనిత తనని చంపొద్దు అంటూ బతిమలాడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.
Also Read: కార్తీక్ మీద పిచ్చితో అడ్డంగా బుక్కైపోయిన మోనిత, ఫైనల్ మలుపు ఇదే!
తాజా ప్రోమో ప్రకారం.. దీప మోనితకి గన్ గురిపెడుతుంది. నీలాంటి రాక్షసులని సంహరించడం కోసమే దేవుడు నన్ను పుట్టించాడు అని దీప అంటుంది. పిల్లల్ని తీసుకుని అందరీని కిందకి వెళ్లిపొమ్మని దీప చెప్పడంతో కార్తీక్ తో సహా అందరూ బయటకి వెళ్లిపోతారు. సౌందర్య పిల్లల్ని తీసుకుని కారులో వెళ్లిపోగా కార్తీక్ మాత్రం అక్కడే ఉంటాడు. మోనిత భయపడుతున్నట్టు నటిస్తూనే పక్కనే ఉన్న బొమ్మ దీప మీదకి విసిరేస్తుంది. గన్ షూట్ సౌండ్ వస్తుంది. కానీ అది ఎవరు ఎవరిని కాల్చారు, ఎవరు చనిపోయారు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. గన్ ఫైర్ సౌండ్ విని కార్తీక్ కంగారుగా దీపా అని అరుస్తూ లోపలికి పరుగులు తీస్తాడు.
ఈరోజుతో కార్తీకదీపం సీరియల్ కి శుభం కార్డు పడనుంది. దీప మోనితను షూట్ చేసి తన కుటుంబాన్ని కాపాడుకుందా? లేదంటే మోనితనే తనకి దక్కని కార్తీక్ ఎవరికి దక్కకూడదు అనుకుని వాళ్ళిద్దరినీ షూట్ చేసిందా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ముగ్గురు చనిపోవడంతోనే సీరియల్ కి ఎండ్ కార్డ్ పడిపోతుందా? ఇదేనా అందరూ మెచ్చే క్లైమాక్స్ అంటే? ఈ క్లైమాక్స్ వంటలక్క అభిమానులని కాస్త నిరాశకు గురి చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: అల్లరి ప్రేమికుల గిల్లికజ్జాలు, వసు మాట అస్సలు వినిపించుకోని రిషి
ఆరేళ్ళ పాటు నిర్విరామంగా సాగిన కార్తీకదీపం సీరియల్ నేటితో ముగిసిపోతుంది. రాక్షస ప్రేమ, నిస్వార్థమైన ప్రేమకి మధ్య జరిగిన యుద్దమే కార్తీకదీపం. ఈ సీరియల్ ఇన్నేళ్ల పాటు కొనసాగింది అంటే అందుకు కారణం డాక్టర్ బాబు, వంటలక్క నటనే. సీరియల్ ఎండింగ్ లో ఇద్దరు చనిపోతే మాత్రం అది వంటలక్క, డాక్టర్ బాబు ఫ్యాన్స్ కి కాస్త మింగుడు పడటం కష్టమైన విషయమే. కానీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. జనవరి 24 వ నుంచి ఈ సీరియల్ స్థానంలో బిగ్ బాస్ మానస్ హీరోగా ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రసారం కానుంది.
Karthika Deepam - Promo | 23rd Jan 2023 | Mon-Sat at 7.30 pm Only on #StarMaa #StarMaaSerials #KarthikaDeepam pic.twitter.com/qPoyRLCC3D
— Starmaa (@StarMaa) January 23, 2023