అన్వేషించండి

Karthika Deepam January 21st Update: కార్తీక్ మీద పిచ్చితో అడ్డంగా బుక్కైపోయిన మోనిత, ఫైనల్ మలుపు ఇదే!

కార్తీకదీపం జనవరి 21 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జనవరి 21 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam January 20th Update)

ఆ మోనిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలి డాక్టర్ బాబు ఫోన్ ని బట్టి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు కదా అని అంటుంది. ఇంతలోనే వారణాసి ఫోన్ చేసి నీ అనుమానమే నిజమైంది దీపక్క ఆ మోనిత ఇంట్లోనే ఉందని చెప్పడంతో సౌందర్య అండ్ కో  రగిలిపోతారు.

మోనిత: గన్ వైపు చూస్తూ నా ఓపికకి నా సహనానికి నువ్వు పరీక్ష పెడుతున్నావు...నీ ప్రాణాలు ఆ దేవుడు తీసుకుపోతున్నాడు కదా అని నేను ఓపిక పడదాం అనుకున్నాను..కానీ ఇక నావల్ల కాదు నీ చావు నా చేతుల్లోనే. నాకు దక్కని కార్తీక్  ఇంకెవరికి దక్కకూడదు కాబట్టి ఈ బాంబు పెట్టి చంపేస్తాను అని బాంబు వైపు చూస్తూ ఉంటుంది.
 ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి ఏం చేస్తున్నారు ఆంటీ అంటుంది
మోనిత: ఏం లేదని కంగారుపడుతుంది. మీ డాడీ ఒప్పుకోకపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది. 
హిమ: మా డాడీ ఒప్పుకుంటారని మీరే అన్నారు కదా మరి ఇలా మాట్లాడుతున్నారేంటి
హిమను లోపలకు పంపించేసిన మోనిత...మీ డాడీని ఒప్పిస్తానే కానీ అది మీ అమ్మని బ్రతికించడానికి కాదు నన్ను పెళ్లి చేసుకోవడానికి అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది.

Also Read: అల్లరి ప్రేమికుల గిల్లికజ్జాలు, వసు మాట అస్సలు వినిపించుకోని రిషి

దీప: నేను సంతోషంగా బతకాలని కోరుకున్నాను. కానీ ఎందుకు ఇలా మధ్యలోనే తీసుకుపోతున్నావు అయితే ఎందుకు అని నేను అడగను. నువ్వు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది కదా అని దేవుడు ముందు మాట్లాడుతూ ఉంటుంది. అలాగే నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అది ఎలా అయినా అమలయ్యేలా చూడు అనుకుంటుంది. ఆ తర్వాత అంతా అక్కడి నుంచి మోనిత ఇంటికి బయలుదేరుతారు. 
కార్తీక్: హిమ మనసు పాడు చేసింది నేను నిన్ను బతికించుకోవడం ఇష్టం లేదు అని హిమ మనుసులో అనుమానపు బీజం నాటేసింది 
దీప: హిమను కాపాడుకోవాలి లేదంటే మీరు దానిని పెళ్లి చేసుకోవాలి
కార్తీక్:ఆ రెండు నేను జరగకుండా నేను చూసుకుంటాను దీపా 
దీప: అది చాలా మొండిది డాక్టర్ బాబు అనుకున్నది సాధిస్తుంది. నేను పోయే ముందు నాకు ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తోంది లేకుండా చేసేసింది
కార్తీక్: నువ్వు భయపడకు దీప హిమను కాపాడుకుని ఆ మోనిత నిజ స్వరూపం హిమకు తెలిసేలా చేద్దాం

Also Read: అసలు విషయం చెప్పిన వారణాసి , మోనిత చాప్టర్ క్లోజ్ - రాక్షస సంహారంతో 'కార్తీకదీపం' శుభం

సౌందర్య- శౌర్య 
శౌర్య: నానమ్మ ఆ మోనిత ఎందుకు ఇలా చేస్తోంది ఏం కావాలి 
సౌందర్య: మీ నాన్న కావాలంట ఎప్పటినుంచో ఇలా ప్రవర్తిస్తోందని అంటుంది సౌందర్య.
శౌర్య: ఇదంతా ఆ హిమ వల్లే నానమ్మ మనమందరం మా మోనిత ఆంటీను తిడుతున్న కూడా అది పట్టించుకోకుండా మళ్ళీ ఆ మోనిత దగ్గరికి వెళ్ళింది
సౌందర్య: ఇదంతా కాదు శౌర్య మనం ఆ మోనిత పీడ ఎలా విరగడ చేయాలో అది ఆలోచించాలి అనుకుంటూ ఉంటుంది. 
మరోవైపు కార్తీక్ దీప వెళ్లి మోనిత ఇంట్లోంచి బయటికి రా మోనిత అని అరుస్తూ ఉండగా ఇంతలోనే మోనిత హిమకు గన్ను పెట్టి బెదిరించి అక్కడికి వస్తుంది. అప్పుడు హిమ హిమ డాడీ అని ఏడుస్తుండగా దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దీప దగ్గరికి రావద్దు హిమను కాల్చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది.
కార్తీక్: మన మధ్య ఏదైనా ఉంటే మనం తేల్చుకుందాం పిల్లలను వదిలేయ్ 
మోనిత: మన మధ్య ఏమి కుదరడం లేదు అందుకే ఇలా ట్రై చేస్తున్నాను 
ఇంతలోని సౌందర్య శౌర్య  అక్కడికి వస్తారు
మోనిత: మీరంతా ఇక్కడే ఉన్నారు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోండి. నేను కూడా ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాను ఆంటీ మీరు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి లేపేస్తాను అనుకుంటూ ఉంటుంది . బాగా ఆలోచించు దీప నీ కూతురు కావాలి అంటే నీకు కూతుర్ని ఇచ్చేస్తాను. నీ భర్తను నాకు అప్పగించు అని అంటుంది. కార్తీక్ ని ఇస్తావా లేకపోతే హిమను చంపేయమంటావా అనడంతో దీప ఏడుస్తూ ఉంటుంది. మోనిత హిమను ఏం చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మోనితా ప్లీజ్ నా బిడ్డను ఏం చేయకు డాక్టర్ బాబు ని నీకు అప్పగిస్తాను అనడంతో మోనిత సంతోష పడుతుంటుంది. 
దీప : ఏం చేయాలి అత్తయ్య ఇది తప్ప మరొక మార్గం లేదు అని అనడంతో అందరూ షాక్ అవుతారు. డాక్టర్ బాబు మనకు మన కూతురు కావాలంటే నువ్వు మోనిత నీ పెళ్లి చేసుకోవాల్సిందే అనడంతో సౌందర్య కార్తీక్ షాక్ అవుతారు. నేను బాగా ఆలోచించాను.. మోనిత కంటే ఎవరూ కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అనడంతో మోనిత సంతోషపడుతుంది.  నీ చేతిలోనే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది అనడంతో ఇదంతా నిజమేనా అని మోనిత సంతోష పడుతూ ఉంటుంది.
అప్పుడు దీప వెంటనే గన్ను తీసుకుని మోనితకి గురిపెట్టి హిమను కాపాడుకుంటుంది. ఎంత ధైర్యం దీప నీకు అని మోనిత అనడంతో దగ్గరికి రావద్దు చంపేస్తాను అంటుంది దీప.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd Test Highlights: 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - కివీస్ విజయభేరి
24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd Test Highlights: 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - కివీస్ విజయభేరి
24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
Embed widget