By: ABP Desam | Updated at : 08 Feb 2022 10:23 AM (IST)
Edited By: RamaLakshmibai
karKarthika Deepam 8th February Episode (Image Credit: Star Maa/Hot Star)
కార్తీక్ కోసం వెతుకుతున్న మోనిత...డాక్టర్ అంజలి ఇంటికి భారతితో పాటూ వెళుతుంది. అక్కడ వంట చేసేందుకు వచ్చిన కార్తీక్ ని చూస్తుంది. అయితే భారతి మాత్రం డాక్టర్ కార్తీక్ ఇక్కడ వంట ఎందుకు చేస్తాడని అక్కడినుంచి తీసుకెళ్లిపోతుంది. మోనితని చూసిన దీప కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా డాక్టర్ అంజలి ఆపేస్తుంది. కేక్ కట్ చేశార వెళ్లమని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్ ముఖానికి టవల్ చుట్టుకుని అందరికీ కేక్ అందిస్తాడు. ఆతర్వాత మోనిత..కార్తీక్ గురించి డీటేల్స్ డాక్టర్ అంజలిని అడుగుతుంది. ఎవరికి ఆపరేషన్ చేశారు.. ఆ పాప తల్లిదండ్రులు ఎవరని అడిగితే వంటవాళ్లేరంటూ వెతుకుతారు. అప్పటికే అక్కడినుంచి వెళ్లిపోతారు దీప, కార్తీక్. ఇప్పుడేం చేద్దాం అని దీప అడిగితే.. మోనిత మనల్ని ప్రశాంతంగా బతకినిచ్చేట్టు లేదు కానీ రుద్రాణి అప్పు తీర్చకుండా వెళ్లిపోలేం కదా అనుకుంటారు. పిల్లలు ఎలా ఉన్నారో అనుకుంటారిద్దరూ...
హిమ రాదా ఎప్పటికీ అక్కడే ఉండిపోతుందా అని అడుగుతుంది శౌర్య. రుద్రాణి మనుషులు వచ్చి హిమను తీసుకెళ్లారని దీప వస్తే ఎలా చెప్పాలి అనుకుంటుంది దీప పక్కింటి ఆమె. అప్పారావు ఇంటికి తాళం వేసి ఉండడం చూసి దీప కార్తీక్ భయపడి ఇంటికి వెళతారు. అప్పారావు ఇంట్లోంచి ఆ రుద్రాణి మనుషులు హిమని తీసుకెళ్లిపోయారని చెబుతుంది. శౌర్య నువ్వు బాగానే ఉన్నావా అంటే నేను బాగానే ఉన్నాను హిమని తీసుకురండని చెబుతుంది. పక్కింటి ఆమెని శౌర్య దగ్గర పెట్టేసి దీప, కార్తీక్..రుద్రాణి ఇంటికి బయలు దేరతారు.
కట్ చేస్తే రుద్రాణి ఇంట్లో ఉన్న రౌడీ... అక్కా హిమని నేరుగా ఇంటికి తీసుకురాకుండా కార్లోనే తిప్పుతున్నావేంటి అని అడుగుతాడు. పైగా ఈ రోజు నేను ఊరు వెళుతున్నాను, నెల రోజులు రానని చెబుతా. హిమ కావాలంటే డబ్బిచ్చి తీసుకెళ్లు లేదంటే నెల రోజులు రాను అంటానంటుంది. ఏం జరిగినా గెలుపు మనదే అన్న రుద్రాణితో ఈ బెదిరింపు ఏదో ఇక్కడే పెట్టుకుని చేయొచ్చు కదా..అనవసరంగా పెట్రోల్ ఖర్చు అంటాడు. గతంలో దీప నన్ను కొట్టింది, దీప మొగుడు మిమ్మల్ని కొట్టాడు...అలాంటప్పుడు హిమని ఇక్కడే ఉంచితే మళ్లీ కొట్టి తీసుకెళ్లరని గ్యారంటీ ఏంటి అంటుంది. ఇంతలో దీప, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. నా కూతురు ఎక్కడ అని అడిగితే..మా ఇంట్లో ఎవ్వరూ లేరని రిప్లై ఇస్తుంది. అరుపులు ఎందుకు..డబ్బులిచ్చి పిల్లని తీసుకెళ్లండి అంటుంది.
దీప కార్తీక్ ఇల్లంతా వెతుకుతుండగా రుద్రాణి..ఊరెళ్లిపోతున్నా అనేసి వెళ్లిపోతుంది. నా బిడ్డ ఎక్కడుందో చెప్పమని దీప వేడుకున్నా.. డబ్బులిస్తేనే చెబుతా అంటుంది.మీ కాళ్లు పట్టుకుంటానని కిందకు వంగుతుంది..ఇంతలో వెనుకనుంచి భుజంపై సౌందర్య చేయి వేస్తుంది. తల్లిని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ..నీక్కూడా డబ్బులు కావాలా..నువ్వు కూడా నా కాళ్లు పట్టుకునేందుకు వచ్చావా అన్న రుద్రాణి చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అన్న రుద్రాణితో..గొంతు తగ్గించి మాట్లాడు అని వార్నింగ్ ఇస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా సౌందర్యతో ... వాయిస్ తగ్గించి మాట్లాడు.. ఆయుష్షు మిగులుతుంది అంటుంది. ఇంతలో దీపతో మాట్లాడుతున్న సౌందర్యతో.. దీప మీకు తెలుసా అని అడుగుతుంది రుద్రాణి. దీప ఎవరనుకుంటున్నావ్ నా పెద్దకోడలని చెబుతుంది.
మమ్మీ నువ్వేంటి ఇక్కడ అన్న కార్తీక్ ని చూసి..ఇతను మీ కొడుకా అని అడుగుతుంది. నా పెద్ద కొడుకు డాక్టర్ కార్తీక్ అని రిప్లై ఇస్తుంది. డాక్టరా అని షాక్ అవుతుంది రుద్రాణి. ఏం చేస్తావే నువ్వు..డబ్బు వడ్డీలకు తిప్పుతావా, నా కొడుకు వందల మందికి గుండె ఆపరేషన్ చేశాడు తెలుసా నీకు.. వందల మంది చేతులెత్తి మొక్కుతారు నా కొడుకు పేరువింటే..తన అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూస్తారు నువ్వెంత నీ బతుకెంత అని కడిగి పడేస్తుంది...
Also Read: చంద్రుడిది-కలువది అందమైన బంధం.. కానీ అవెప్పుడూ కలుసుకోలేవు.. పిండేసిన గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్
Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!
Naga Panchami Serial December 9th Episode పంచమి చనిపోతుంది అని మోక్షకు తెలిస్తే.. కరాళి మాస్టర్ ప్లాన్!
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>