Kangana Ranaut: విల్ స్మిత్ చేసిన పనిపై కంగనా రియాక్షన్ ఇదే
కంగనా విల్ స్మిత్ కి సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాస్పద కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ విల్ స్మిత్ ఇష్యూపై స్పందించింది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అయితే ఆస్కార్ అవార్డు వేదికపై అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు విల్ స్మిత్. స్టేజ్ పై ఉన్న క్రిస్ ఆడియన్స్ ను నవ్వించడానికి కొన్ని జోక్స్ వేశాడు. విల్ స్మిత్ భార్యపై కూడా జోక్ వేశాడు. దీంతో విల్ స్మిత్.. క్రిస్ రాక్ ను కొట్టాడు.
ఈ విషయంపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కంగనా అయితే విల్ స్మిత్ కి సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 'కొంతమంది ఫూల్స్ ని నవ్వించడానికి మా అమ్మ లేదా సోదరిల అనారోగ్యాన్ని ఉపయోగించినట్లైతే నేను కూడా విల్ స్మిత్ లానే చెంప పగలగొడతాను. ఇలా బిహేవ్ చేసిన విల్ స్మిత్ తప్పకుండా నా లాకప్ షోకి వస్తాడని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ పెట్టింది.
కాంట్రవర్షియల్ రియాలిటీ షో 'లాకప్'కి కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క సినిమాలు, మరోపక్క ఈ షోతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. విల్ స్మిత్ తను చేసిన పనికి క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరుతూ ఓ లెటర్ షేర్ చేశారు. 'నేను తప్పు చేశాను. క్రిస్ రాక్ కి క్షమాపణలు. ఆస్కార్ అకాడమీ కూడా నన్ను క్షమించాలి. ఆవేశంలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది' అంటూ రాసుకొచ్చారు.
VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa
— Timothy Burke (@bubbaprog) March 28, 2022
View this post on Instagram