Jr NTR: ఇన్నాళ్లకు అమ్మ కల నిజం చేశా- పుట్టిన రోజుకు ముందే నెరవేర్చడంతో సంతోషంగా ఉందన్న ఎన్టీఆర్
Jr NTR | నటుడు జూ. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఉడిపి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కలిసి ఉడిపి మఠానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
Jr NTR Family And Rishab Shetty Visit Udupi Temple: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించి ‘దేవర’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఆయన చేతికి గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు డబ్బింగ్ పనులు మొదలుకాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మంగుళూరుకు వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఉడిపి శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎప్పటి నుంచో తన తల్లి తనను ఉడిపి మఠంలో శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలని కలగనేదని, ఆమె పుట్టిన రోజుకు మరో రెండు రోజుల ముందే ఆ కోరిక నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నారు.
My mother's forever dream of bringing me to her hometown Kundapura and seeking darshan at Udupi Sri Krishna Matha has finally come true! To make it happen just before her birthday on September 2nd is the best gift I could give her.
— Jr NTR (@tarak9999) August 31, 2024
Thanks to @VKiragandur sir and my dearest… pic.twitter.com/sj3rtExmnp
ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ ను రిసీవ్ చేసుకున్న రిషబ్ శెట్టి
హైదరాబాద్ నుంచి మంగళూరుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఎయిర్ పోర్టులో రిషబ్ శెట్టి రిసీవ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ క్యాజువల్ షర్ట్, జీన్స్ లో కనిపించగా, రిషబ్ శెట్టి వైట్ షర్ట్, వైట్ పంచెలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా వాళ్లు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠానికి వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ తన తల్లి, భార్యతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రిషబ్ శెట్టి దగ్గరుండి వారికి దర్శనం చేయించారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా వారితో ఉన్నారు. అనంతరం ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కలిసి అన్నదాన సత్రంలో భోజనం చేశారు. తన ఫ్యామిలీ దర్శనానికి ఏర్పాట్లు చేసిన రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో పాటు నిర్మాత విజయ్ కిరగందూర్ కు ధన్యవాదాలు చెప్పారు.
రిషబ్ శెట్టితో ప్రత్యేక అనుబంధం
ఎన్టీఆర్, రిషబ్ శెట్టికి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు సమీపంలోని కుందాపుర. రిషబ్ శెట్టిది కూడా అదే ఊరు. చాలా కాలంగా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, తాజాగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఒకే చోట కలవడంపై సినీ అభిమానులు సంథింగ్ స్పెషల్ గా భావిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఏదైనా కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది.‘కాంతార’ ప్రీక్వెల్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన అచ్చే అవకాశం ఉంది.
ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ… 🙏🏼✨#Udupi #udupisrikrishna@tarak9999 #PrashanthNeel pic.twitter.com/Nk5TkRYErs
— Rishab Shetty (@shetty_rishab) August 31, 2024
Man of Masses @tarak9999 and Rishabh Shetty clicked at Mangalore Airport. pic.twitter.com/7OJZzlchCo
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2024
ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ అనే సినిమా ప్రారంభం అయ్యింది. ‘దేవర’ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది.
Read Also: అడ్వాన్స్ బుక్కింగ్స్‌లో దుమ్మురేపుతున్న 'దేవర' - అక్కడ ప్రీ-సేల్ బిజినెస్ ఎంత అయ్యిందంటే!